హైదరాబాద్, ప్రజాతంత్ర : ఫార్ములా ఈ-కారులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి ఇప్పించడం తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish rao) అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి పారదర్శకతతో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందటం అప్రజాస్వామికం. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న చిల్లర డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. అక్రమ కేసులతో కేటీఆర్, బిఆర్ఎస్ నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. కేటీఆర్ కు బిఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.





