– అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు
– తేమ శాతం నిబంధనలు సడలించండి
– సీసీఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ముంబై, అక్టోబర్ 28: రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముంబైలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్ గుప్తాతో ప్రత్యేకంగా భేటీి అయ్యారు. వారిద్దరి మధ్య గంటపాటు సాగిన ఈ సమావేశంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎంఎస్‌పీకి పత్తి సేకరణ, రైతులకు తక్షణ ఉపశమనం అందించాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు. తేమ శాతం నిబంధన సడలింపు తప్పనిసరి అని చెప్పారు. తెలంగాణ సహా దక్షిణ భారత రాష్ట్రాలలో అధిక తేమ స్థాయిలు ఉన్న కారణంగా ప్రస్తుత ఫెయిర్ యావరేజి క్వాలిటీ(ఖీAూ) నిబంధనల ప్రకారం నిర్దేశించిన 8-12% తేమ శాతాన్ని పాటించడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్నాయని, అందుకే రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు తేమ శాతాన్ని తక్షణమే 14% వరకు సడలించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న సాగు ఖర్చులకు అనుగుణంగా పత్తికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని సవరించాలని, అలాగే పత్తి పండిరచే అన్ని జిల్లాల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను విస్తరించి ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ నుండి రైతులను కాపాడాలని కోరారు.
తక్షణ ఉపశమన చర్యలు
తెగుళ్ల, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రత్యేక ఉపశమన ప్యాకేజీ అందించాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు. గత సీజన్లలో సేకరించిన పత్తికి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మార్కెట్ యార్డు స్థాయిలో ఆధునిక తేమ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తెలంగాణ రైతులకు న్యాయం జరిగి, వస్త్ర సరఫరా గొలుసు బలోపేతం అయ్యేలా వ్యక్తిగత శ్రద్ధ వహించాలని అభ్యర్థించారు. మంత్రి తన విజ్ఞప్తిలో పేర్కొన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సానుకూలంగా పరిష్కరిస్తామని లలిత్ కుమార్ గుప్తా హామీ ఇచ్చారు. మంత్రి వెంట జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌్ రెడ్డి కూడా ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





