ఖమ్మం పరిశుభ్రత బాధ్యత ప్రజలదే

– నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన

ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: ఖమ్మం నగరాన్ని అందంగా తీర్చిదిదద్దడంతోపాటు పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యమని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీలకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం పట్టణం గతంలో చిన్న పంచాయతీగా ఉండేది, నాలుగు వేల జనాభా మాత్రమే ఉండేదని తెలిపారు. డివిజన్లను మీరే పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డివిజన్‌కు కావలసిన మౌలిక సదుపాయాలు కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యను సంప్రదించాలని సూచించారు. మన కార్పొరేషన్‌ను చూసి ఇతర ప్రాంతాలు నేర్చుకునేలా ఉండాన్నారు. నగరంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, కక్షలకు, కార్పణ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి తుమ్మల కోరారు. ఉన్నతమైన చదువులు చదివితే ఆ కుటుంబం పేదరికాన్ని జయిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌, అమెరికా కంటే మంచి చదువు ఖమ్మం నగరానికి వస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీలపరంగా ఎవరిపైనా కేసులు పెట్టొద్దని పోలీసులకు సూచించానన్నారు. అలాగే రోడ్ల వెడల్పు సందర్భంలో నాయకుల ఇండ్లనైనా సరే కొంత తీసుకోక తప్పదు అని స్పష్టం చేశారు. బైపాస్‌ రోడ్డు వేసినప్పుడు తనను తిట్టుకున్నారని, ఇప్పుడు బైపాస్‌ రోడ్డు కూడా జామ్‌ అవుతోందని, ఇంకా రెండుమూడు వందల కోట్ల రూపాయలు సీఎం రేవంత్‌ రెడ్డిని అడిగి తీసుకుని వస్తాను.. గుడిసెల్లో బతికే పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు. పేదలకు మంచి చేసే విధంగా రాజకీయం ఉండాలి తప్ప ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని తుమ్మల పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *