అబద్ధాలు ఆపండి

– కేసీఆర్, కేటీఆర్, హరీష్ లు పద్దతి మార్చుకోవాలి
– నా తప్పులను నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
– నాదర్ గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ బిఆర్ఎస్ ప్రభుత్వమే
– 2014 నుంచి వారి దోపిడీ 2023 వరకూ సాగింది
– రాఘవ కన్‌స్ట్ర‌క్ష‌న్స్‌ మోచేతి నీరు తాగిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు
– బీఆర్ఎస్ ఆరోపణలపై విరుచుకుపడ్డ మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, పలువురు మంత్రులపైనా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్ష‌న్ లో హరీష్ రావు, కేటీఆర్ లు చేస్తున్న పలు ఆరోపణలపై రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా స్పందించారు. సచివాలయంలో బుధవారం  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ మార్ రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, సామెల్. బి.లక్ష్మారెడ్డి, శ్రీ గణేష్, రాంమోహన్ రెడ్డి తదితరులతో కలిసి తనదైన శైలిలో బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ డైరెక్ష‌న్ లో అబద్ధాల హరీష్ రావు, డ్రామారావు కేటీ ఆర్ లు మా ప్రభుత్వం, మా మంత్రులపై సత్య దూరమైన ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న మీరు ఇప్పుడు ఆ బురదను మా ప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. నాదర్గుల్, వట్టినాగులపల్లి, కొత్వాల్ గూడ‌ అంశాలపై మంత్రి ఆధారాలతో సహా ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. “నాదరగుల్ లో సర్వే నెంబర్ 613 నాదురుగుల్ గ్రా మంలో, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఇందులో ఉన్న 373 ఎకరాల 13 గుంటలు. ఇది ప్రైవేటు భూమిగా, కొన్ని సందర్భా ల్లో 2004 నుంచి గవర్నమెంట్ భూమిగా. రకరకాలుగా అనేక కోర్టుల్లో దీన్ని కొట్లాడాం. ఒకసారి ప్రైవేటు పార్టీ గెలవడం, ఒకసారి ప్రభుత్వం గెలవడం, పైకోర్టులకు పోవడం, పోలీసు సపోర్ట్ కోర్ట్ డైరెక్షన్ తెచ్చుకోవడం ఆ నాటి ప్రభుత్వంలో కొన్నిజరిగాయి. దీంట్లో గమనించాల్సిన విషయం ఉంది. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ఫా ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒమెగా డెవలప్మెంట్స్ వెంచర్ ప్రైవే ట్ లిమిటెడ్ అనే మూడు సంస్థలకు 1-9-2014 నాడు నాదరగుల్ గ్రామాన్ని613 సర్వే నెంబరులో రిజిస్ట్రేషన్ చేసింది మీ ప్రభుత్వం కాదా? ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసింది మీరు కాదా? ఈ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను 2016 సెప్టెంబర్ 24 మ్యుటేషన్ చేసింది మీ ప్రభుత్వంలో కాదా? 2014లో కానీ, 2016లో కానీ అధికారంలో ఎవరున్నారు హరీష్ రావు గారు? ఇందాక చెప్పిన మూడు కంపెనీలకు ఫైల్ నెంబర్ బి/1351/2/2021-1-1, 2021-2, 2021-3, 2011-3 వీళ్లకు మ్యుటేషన్ చేసిం ది మీ ప్రభుత్వంలో అవునా కాదా? ప్రతిదీ వివరాలతో కూడిన డాక్యుమెంట్ ఇస్తాను. ఇది మీ ప్రభుత్వంలో మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ జరిగితే ప్రస్తుత ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? అంతేకాదు 10-02-2021 గూగుల్ మ్యాప్ చూడండి. ఇక్కడ అప్పటికీ ఏమి ఏర్పాటు చేయలేదు. అదే విధంగా 05-12-2021 ఈ గూగుల్ మ్యాప్ లో కలర్ తో కొన్ని ప్రాంతాల్లో మొదలుపెట్టాడు. రేకులు కట్టడం, రోడ్లు వేయడం మొదలుపెట్టాడు. 5-12-2021 నేను చూపించే ప్రతిదీ మీకు గూగుల్ లో కనిపిస్తుంది. నేనేమి మానిప్యులేట్ చేసేది కాదు. ప్రభు త్వం, నా అధికారులు తయారు చేసిచ్చింది కాదు. అదేవిధంగా 5-1-2022 రేకులు, రోడ్లు వేసింది గూగుల్ పిక్చర్ లో కనిపిస్తుంది. 17-11-2022లో పూర్తిగా కలర్ తో మీకు స్పష్టం గా కనిపిస్తుంది. దీన్ని 2022-11 నెలలో పూర్తిగా మీ టైంలో షీట్లు పెట్టి దానికి పూర్తిగా రోడ్లు వేసింది మీ ప్రభుత్వంలో కాదా?

ప్రజాప్రభుత్వం వచ్చే వరకు ఐదు మ్యాపులు తెప్పించా. అంటే నీకు కమిషన్ వచ్చి నంత వరకు నీ ప్రభుత్వంలో, మీ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల పంపకం విషయం వచ్చే వరకు, అవి పరిష్కరించుకునే వరకు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, కేసీఆర్ కూతురికి కూడా ఇవ్వాల్సిన వాటాలు ఇవ్వరు. ఏ ఒక్క ఆరోపణలకైనా హరీష్ రావు సమాధానం చెప్పాడా? కాళేశ్వరం, డైరీల గురించి ఎత్తుకుంది. ల్యాండ్ లు ఎలా కబ్జా చేసిందో ఎత్తుకుంది. దేనికైనా సమాధానం చెప్పిండా ఆ కేసీఆర్ కూతురుకు. నేను వేసే ప్రశ్నలు కాదు. నాదర్గుల్ ల్యాండ్ కు సంబంధించిన దాంట్లో రిజిస్ట్రేషన్ 2014  మీ ప్రభుత్వంలో జరిగింది. 2016 మ్యుటేషన్ చేసింది మీ ప్రభుత్వం. ఎస్ఎల్పీలో 2022లో కౌంటర్ వేయకుంటే, 2026లో కౌంటర్ వేసి కొట్లాడుతుంది మేము. 2021 నుంచి 2022 చివరి వరకు దాని చుట్టూ రేకులు పెట్టించి రోడ్లు వేయించింది మీ టైంలో. ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎందుకు ప్రభుత్వంలోని మంత్రులను, నన్ను ఎందుకు లాగుతున్నావు? ఇంకో విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో నా కొడుకు హర్షా రెడ్డి గురించి చెబుతాడు. దీంట్లో పార్టనర్ అంటాడు. ఏ మూడు కంపెనీలు దీంట్లో పార్టనర్లు అంటున్నాయో, ఏ కంపెనీలో ఈ భూమిని క్లెయిమ్ చేస్తున్నాయో, ఆ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలలో నా భార్య కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉంటే ఛాలెంజ్.. అబద్దాలు రావు.. ఏదో మ్యాటర్ తీసుకొచ్చి, అవుట్ డేటెట్ కేస్ తెచ్చి, దాన్ని ఇదిగో అని అబద్ధాన్ని పేపర్ చూపించి చిత్రీకరించొద్దని ఖబర్దార్ అని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. ఇక రెండో అంశం వట్టినాగులపల్లిది.. ఇది షా కుటుంబానికి సంబంధించిన కుటుంబ పం చాయితీ. వారందరూ కుటుంబ సభ్యులు. ఎప్పు డో 60-70 సంవత్సరాల క్రితం కొనుకున్న భూమి. కుటుంబానికి సంబంధించిన భూమి లో ఒక పార్టనర్ దగ్గర ఆ ప్రభుత్వానికి సంబం ధించిన వాళ్ళ టైంలో జరిగింది ఏదైతే ఉందో.. వట్టినాగులపల్లి కుటుంబ విషయాన్ని ప్రభుత్వా నికి అంటగడుతున్నారు. అక్కడ యదార్థం ఏంది? దాంట్లో నీ స్వార్థం ఏంటి? వారికొచ్చిన లాభమేంటో చెబుతాను. షా కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబ సభ్యుడి దగ్గర ఒక కంపెనీ డెవలప్మెంట్ తీసుకుంది. ఆ కంపెనీలో నా కొడుకు కూడా భాగస్వామి. ఆ కంపెనీ డెవలప్మెంట్ కు తీసుకుంటే షా కుటుంబానికి సంబంధించిన ఆస్తి.. ఇది వట్టినాగులపల్లిలో వారు చెబుతున్న భూములు. మ్యాప్ లో గ్రీన్ కలర్ సంబంధించినది. ఆ హోమ్, ఈ హోమ్ అని పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది కదా.. అవి కేటీఆర్, హరీస్ రావుకు సంబంధించిన సంస్థ ఆ హోమ్, ఈ హోమ్ అని ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన సంస్థ ఈ గ్రీన్ కలర్ కు సంబంధించింది డెవలప్మెంట్ తీసుకుంది. ఈ బ్లూకలర్ కు సంబంధించింది ఇంకొకరు తీసు కున్నారు. దాంట్లో నా కొడుకు ఒక భాగస్వామి. ఒక ఈ రెడ్ కలర్ కు సంబంధించింది షా కు టుంబం పంచాయితీ ఉంది. అది వారి అన్నద మ్ములది. దీంట్లో ఆనాడు దివంగత నేత రాజశే ఖర్ రెడ్డి ఓఆర్ఆర్ ఏర్పాటు చేసేటప్పుడు, ఓఆర్ఆర్ లో సర్వే నెంబర్లకు చెందని కొంత ఆస్తి ప్రభుత్వం సేకరించింది. సేకరించినప్పుడు భూమి తగ్గింది. భూమి ప్రభుత్వం తీసుకున్న తరువాత ఏదైతే బలవంతులు ఉంటారో, ఎవరై తే అధికార పార్టీ అండ ఉంటదో, వారిది నాదని ఫెన్సింగ్ వేసుకొని డిమార్కేషన్ చేసుకుంటారు. అలా చేసుకున్నదే ఈ గ్రీన్ పార్ట్. ఆ హోమ్, ఈ హోమ్ అనే కంపెనీ ఒక ఓనరు దగ్గర నుంచి చేసుకుంది. షా కమ్యూనిటీకి సంబంధించింది కాదు. ఈ ఆ హోమ్ ఈ హోమ్ ఏదైతే ఉందో.. వీళ్ల కోసమని ఈ ఓఆర్ఆర్ పోయిన భూమి తమకు సంబంధం లేదు. మా బిట్ ఇదని ఈ గ్రీన్ పార్ట్ కు సంబంధించిన 21 ఎకరాల 28 గుంటలు పొజిషన్ లోకి వచ్చారు. ఎప్పుడైతే ఓఆర్ఆర్ పోయిందో. అది పోయిన తరువాత ఆ ఓఆర్ఆర్ వాళ్ల షేర్ డిలీట్ చేసుకోకుండా ఆ కుటుంబంలో వచ్చిన సమస్య. దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు.

కొత్వాలుడా విషయంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభు త్వం మీద ఎలా అబద్ధాలు మాట్లాడాడో.. అది కూడా పచ్చి అబద్దాలు. అబద్ధాల రావు గురించి ఇది కూడా చెప్తా. దీంట్లో, ఏదైతే కొ త్వాల్ గూడలో క్రషర్ కు సంబంధించిన సబ్జెక్ట్. రాఘవ కన్ స్ట్రక్షన్ హైదరాబాద్ లో రేడియల్ రోడ్డు చేస్తోంది. ఆ రేడియల్ రోడ్డు డిపార్టు మెంట్ కు తిరుమల కన్ స్ట్రక్షన్ మెటల్ సప్లై చేస్తోంది. 2007 నుంచే క్రషర్ నడచుకుం టోంది. అక్కడున్న రైతుల దగ్గర ల్యాండ్ లీజు కు తీసుకొని కుమార రాజు అనే అతను క్రషర్ నడుపుకుంటున్నాడు. అందులో ఒక చిన్న ఇల్లు అతనికి ఉంటుంది. పవర్ బిల్లువు కూడా ఉం టాయి. ఎప్పటి నుంచో వస్తున్న కరెంటు బిల్లు లు ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. మోకాలికి బోడుగుండుకు ముడివేసి రాఘవ కన్ స్ట్రక్షన్ సంబంధం ఉందంటాడు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇస్తాను. దీనికి సంబంధించిన దాంట్లో ఓఆర్ఆర్ వచ్చిన తరువాత కాలుష్యం గుర్తించి ప్రాంతంలోని క్రషర్లను సీజ్ చేశారు. తీసేయమని ఆదేశించారు. క్రషర్ తీసేసిన తరువాత, రాఘవ కన్ స్ట్రక్షన్ మెటీరియర్ అవసరం ఉందో.. బుద్వేల్ లో వందలాది ఎకరాలు ఆక్షన్ పెట్టారు. ఆ ప్రదేశంలో బండను పగలకొట్టి రోడ్లు వేసి, ఆ రాక్ మక్కుకు సంబంధించిన మక్కుని క్రష్ చేస్తే తిరుమల వారి నుంచి రాఘవ కన్ స్ట్రక్షన్ కొనుకున్నారు. దానికి పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ క్రషర్ ఒరిజినల్ గా కర్నూలులో రాఘవ కన్ స్ట్రక్షన్ క్రషనర్, వర్క్ అయ్యాక అమ్మేటప్పుడు తిరుమల మెటల్ ఇండ స్త్రీ వాల్లు కొనుకున్నారు. క్రషర్ పెట్టుకొని కొత్త గా కోరీలు తిరుమల ఇండస్ట్రీ వారు ఏం చేయలేదు. ఒక బ్లాస్టర్ కూడా చేయకుండా, బుద్వేల్ ల్యాండ్ రోడ్లకు వచ్చే స్పాయిల్ తిరుమల ఇండ స్త్రీ మెటల్స్ వారు క్రష్ చేస్తే రాఘవ వారు కొని వాడుకోవడం జరిగింది. దీంట్లో ఆర్టీఏ కింద అబద్ధాల రావు టీం, డిపార్ట్మెంట్ వాళ్లను లెటర్ అడుగుతారు, దాంట్లో మైనింగ్ వారు, అసెం బ్లీలో ఇదిగో పేపర్ అని చూపించేది, రాఘవ ఎంత సీనరైజ్ కట్టాలని చూపిస్తారు. ఆ మెటల్ కు సంబంధించిన సీనరైజ్ అనేది హెచ్ఎర్డీ సీఎల్ రేడియల్ రోడ్ ఫార్మేషన్ చేసే డిపార్ట్మెం ట్, వారు రెండు కోట్ల 77 లక్షలు కడతారు. నిన్ననో మొన్ననో మళ్లీ కట్టారు. అయితే క్రషర్ కు, రాఘవ సంస్థకు సంబంధం ఏంటి. మొద టి నుంచి తిరుమల మెటల్ ఇండస్ట్రీ వారిదనేది ఆధారం ఉంది. పూర్తి ఎస్లాబ్లిష్మెంట్ డాక్యు మెంట్ ఉంది. అయితే దీనికి సంబంధించిన దాంట్లో ఏదైతే తిరుమల మెటల్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో జీఎస్టీ, ఇతర రాత్ర కూడా పూర్తి ఆధారాలతో ఉన్న పేపర్లు మీకిస్తా. పవర్ బిల్, ప్రతిదీ ఉంటుంది. రాఘవ కన్ స్ట్రక్షను, క్రషరకు సంబంధం ఏంది? ఎట్లంట వు? అంటే ఇదిగో అధ్యక్ష అని అసెంబ్లీలో చెబ తాడు. ఆ అబద్ధాల రావు ఉరి వేయమంటడు.. లీటర్ పెట్రోల్ కొనడానికి వంద రూపాయలు ఉంటుంది కానీ, అగ్గిపెట్ట లేదన్నదాంట్లో అబద్దం ఎంతుందో.. ఇది కూడా అంత అబద్దం. మీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన లిస్టులు ఒక్కొక్కటి మా మిత్రలు ఇస్తున్నారు. ఒక్కొ క్కటి బయటకు తీసే సందర్భం తప్పకుండా తొందర్లో ఉంటుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది అని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *