29. జనధర్మో విజయతే
ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ [1] (సెప్టెంబరు 9, 1914 – నవంబరు 13, 2002) “కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న” గేయం లో కొన్ని భాగాలు. (“తెలంగాణ రక్షణల” అమలు కోసం ప్రాంతంలో ఉద్యమం ప్రారంభమై, “ప్రత్యేక తెలంగాణా పోరాటం“గా రూపొంది గత అయిదు నెలల నుండి సాగుతున్న ఉద్యమంలోని వివిధ సందర్భాలను ‘ప్రజాకవి‘ శ్రీ కాళోజి నారాయణరావుగారు జనధర్మ లో 1969లో ప్రచురించారు.)
ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు.
ఎవరనుకున్నారు
ఇట్లౌనని ఎవరనుకున్నారు.
ఆంధ్ర తెలంగాణలకు
అన్యత ఏర్పడుతుందని
హామీలిచ్చినవారే
అంత స్వాహా చేస్తారని ॥ఎవర ||
అన్నలు ఒప్పందానికి
సున్నా చుట్టేస్తారని
పరిపాలనతో తమ్ముల
‘ఫజీత’ పాలు చేస్తారని ॥ ఎవర ॥
ముఖ్యమంత్రియే స్వయముగ
సఖ్యత ఛేదిస్తాడని
ప్రాంతీయాధ్యక్షుండు
ప్రక్క తాళమేస్తారని ॥ ఎవర ॥
‘కావలి కుక్కలు’ దొంగల
గంజికాసపడతాయనీ
కావలికాడే దొంగల
కావళ్ళను మోస్తాడని ॥ఎవర॥
సిబ్బందిలో గల తమ్ముల
ఇబ్బంది పెడతారని
అన్నలమను మాట మరచి
అహంకార పడతారని ॥ఎవరణ॥
తమ్ముని తల బోడిచేసి
దక్షత అనుకుంటారని
తంతే-తమ్ముడు అన్నను
తన్నిండని అంటారని ॥ ఎవర ॥
తప్పుడు లెక్కతొ తమ్ముల
నెప్పుడు ఒప్పిస్తారని
అంకెల గారడి చేస్తూ
చంకలు ఎగిరేస్తారని ॥ ఎవర ॥
పోచంపాడు శకుని
పాచిక పాడౌతుందని
తెలంగాణవాసులకు
త్రిశంకుస్థాయి వస్తుందని ॥ఎవర॥
ప్రాంతాన్ని పాడుచేసి
శాంతి శాంతి అంటారని
కడుపుల్లో చిచ్చుపెట్టి
కళ్ళు తుడువ వస్తారని || ఎవర | |
అధికార ప్రకటనలో
అబద్దాలే ఉంటాయని
బాధ్యతగల మంత్రికూడ
దాతాలే కొడతాడని ॥ఎవర||
నాన్-ముల్కీ ఉద్యమం
స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే న్యాయమా?
నాన్ ముల్కీ ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలో స్థానికేతరులకు (నాన్-ముల్కీలకు) ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ జరిగింది. వరంగల్ నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమానికి విద్యార్థులు నాయకత్వం వహించారు “నాన్-ముల్కీ గో బ్యాక్” అనే నినాదాలు చేశారు.
నాన్ ముల్కీ ఉద్యమం కరన్ లియోనార్డ్ ఆద్యుడు
ఆంధ్ర పెత్తనం పైన తెలంగాణ స్థానికులకు ఉద్యోగాల గురించి ఉద్యమం రావడం మానవ హక్కుల ఉద్యమం. హైదరాబాద్ లో నాన్ ముల్కీ ఉద్యమం గురించి కరెన్ ఇసాక్సెన్ లియోనార్డ్ మొదటి వ్యాసం రాసిన వాడు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, ఇర్విన్ (UC Irvine) లో చరిత్రకారిణి మానవ శాస్త్రవేత్త. ఆమె హైదరాబాద్ డయాస్పోరా వంటి అంశాలపై అధ్యయనాలు చేశారు.
- 1952 జులై 26న వరంగల్‌లో నాన్-ముల్కీలకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఉద్యమాన్ని ప్రారంభించారు.
- విద్యార్థులు “నాన్-ముల్కీ గో బ్యాక్” మరియు “ఇడ్లీ సాంబార్ గో బ్యాక్” వంటి నినాదాలు చేశారు.
- ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికుల హక్కులను కాపాడాలనేది ప్రధాన డిమాండ్.
- ఈ ఉద్యమం 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి దారితీసిన పరిణామాల నేపథ్యంలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది.
| 28వ సీరియల్ లో జనధర్మ పత్రికల ప్రత్యేక సంచికలో తెలంగాణ ఉద్యమ సర్వ చరిత్ర సంగ్రహం రచయిత ఎ. వి. ఆర్. ఆధారాలు ఇవి:
1) 1953లో నాన్ ముల్కీ ఉద్యమ సందర్భంగా జరిగిన సంఘటనలూ, 2) తెలంగాణా మహా సభ స్వర్గీయులు శ్రీ నెహ్రూకూ, శ్రీ గోవిందవల్లభ్ పంత్ కూ సమర్పించిన నివేదికలూ, విజ్ఞప్తులూ. 3) శ్రీ కె. అచ్యుతరెడ్డి తెలంగాణాకు జరిగిన అన్యాయాలను గూర్పి వివరించిన నివేదిక 4) ప్రాంతీయ సంఘం చేత నియమితమైన శ్రీ యం యస్. రాజలింగం వగైరా త్రిసభ్య సంఘం వివేదిక అంశాలూ యన్. జి. ఓ. ల సంఘం ప్రచురించిన పుస్తకం మొదలగునవి ఆధారం |
ఆంధ్ర పరిపాలన నుండి విముక్తి కోసం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోరుతూ శాంతియుతంగా సత్యాగ్రహం జరుగుతున్నప్పుడు, ప్రజల వాంఛను మన్నించవలసిన ప్రజా ప్రభుత్వం దమనకాండ కొనసాగిస్తూ కాల్పులు చేసి నిండు ప్రాణాలను తీస్తుండటం ఆంధ్ర ప్రాంతీయులై పెట్టుబడిదారులచే గుండాలను ఆర్గనైజ్ చేసి నిర్మూలించడానికి పన్నాగాలు సాగిస్తున్నట్లు తమ నాయకుడి ద్వారా తెలిసిన ప్రజలు చావో బ్రతుకో తేల్చుకో నిర్ణయించుకొని రంగం మీదికి వీరసింహాలుగా ఉండటంలో ఎంతమాత్రం ఆశ్చర్యంలేదు.
ఫలితం 5, 6 జూన్ తేదీలలో రాజధాని నగరాలు స్మశాన పోలిక తెచ్చుకున్నాయి. డాబు దర్పాలు ప్రదర్శించి, ప్రగల్భాలు వల్లించిన ప్రభుత్వంగాని, దాని పోలీసులు గాని, వారి చేతి తుపాకులు గాని గూండాయిజం రౌడీయిజంగాని గుడ్డి గవ్వకు మారలేదు. రాజధానిలో లక్షల విలువ చేసే ప్రభుత్వ – ప్రయివేటు ఆస్తిపాస్తులు ప్రజాకోపానలంలో భస్మమైనయ్.
ముఖ్యమంత్రిని నిలదీసిన ఇందిర ప్రధాని
ఉద్యమం మొత్తంలో 50 మంది ఆహుతి అయితే. రెండురోజులలో సుమారుగా అంతే సంఖ్యలో పోలీసుల కాల్పులకు బలైనారు. ఈ మహా ఘోర దురంతాలకు అగ్రనాయకత్వం వహించిన ముఖ్యమంత్రిని ఢిల్లీ పిలిచింది. బొంబాయిలో ఉన్న హోంమంత్రి శ్రీ చవాన్ ఢిల్లీ పరుగు తీశారు. జైపూర్ ప్రయాణాన్ని ప్రధాని ఆపుకుని ఢిల్లీలో ముఖ్యమంత్రిని నిలదీశింది. హైద్రాబాద్లో కాల్పులు, మరణాలు ఢిల్లీలో మాటలు – ప్రగల్బాలు పత్రికల్లో. 4 జూన్ న అకస్మాత్తుగా ప్రధాని హైదాబాద్ వచ్చి శ్రీ చెన్నారెడ్డి, హయగ్రీవాచారి కె.వి. రంగారెడ్డి వగైరా నాయకులను. ఎస్. ఎస్ పి, కమ్యూనిస్టు జనసంఘం స్వతంత్ర పార్టీ ఆదిగా గల ప్రతిపక్షాల నాయకులను పిలిపించి మాట్లాడింది. ప్రశాంతంగా ఉండమని విజప్తి చేసింది ప్రధాని.
7 ఉదయం హోంమంత్రి శ్రీ చవాన్ హైద్రాబాద్ వస్తారట! రెండురోజులుండి సమస్యను క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటారట! ఆ తర్వాత తగినచర్య తీసుకుంటారట! ఇంకా తగిన చర్య ఏమిటి? ఏదీలేదు. ఇంత జరిగాక ఇందరు ఆహుతి అయినాక మిగిలిన “తగుచర్య” తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయుటమే ఆ విశేష వార్త కోసం మనం నిరీక్షిద్దాం, అని రచయిత ఎ వి ఆర్ ఈ వ్యాసం ముగించారు.





