ఇం‌దిరమ్మ రాజ్యంలో పేదలకు సంక్షేమ పథకాలు

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచారశాఖ మంత్రి పొంగులేటి
రూ 3.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

జూలూరుపాడు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3: ‌పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించడమే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేటతండా, జూలూరుపాడు, అనంతారం గ్రామాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ.3 కోట్ల 60 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులను వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌ ‌నాయక్‌తో కలిసి మంగళవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అనంతారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా  సీఎం రేవంత్‌ ‌రెడ్డి రైతులకు రూ.21వేల కోట్ల మేర రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించారన్నారు.

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్‌ ‌పదేళ్లు పాలనలోఅప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందని అన్నారు. రాష్ట్రంలో 8 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. రైతుల ఖాతాల్లో నగదును బోనస్‌తో కలిపి మూడు రోజుల్లో ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. ఈనెల 5న సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.5 లక్షల మందికి ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాలలో ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వం తరఫున నిలబడే వారికే పట్టం కట్టాలని, గ్రామాలకు వచ్చి గాలి మాటలు చెప్పేవారిని నమ్ముద్దని కోరారు.

నరసాపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ …..
జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి పొంగులేటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు భోజనాలు, వంటగదిని, స్టోర్‌ ‌రూంని పరిశీలించారు. మజ్జిగ పల్చగా ఉండడంతో వార్డెన్‌ ‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలూరుపాడు తహసీల్దార్‌ ‌ను వసతి గృహాలను సందర్శిస్తున్నారా? లేదా ? అని ఆరా తీశారు. కచ్చితంగా వారంలో ఒక్కసారి మండల పరిధిలోని వసతి గృహాలను పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. ఉద్యోగం అంటే ఖమ్మం నుంచి రాకపోకలు కొనసాగించడం.. కార్యాలయంలో కూర్చోడం కాదని, వారంలో ఒక్కసారైనా వసతి గృహాలను, పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. అదేవిధంగా స్థానికంగా నివాసముండాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. మెనూ ప్రకారం భోజన పదార్థాలను అందిస్తున్నారా లేదా? అని భోజనం నాణ్యంగా ఉంటుందా లేదా? అని ఆరా తీశారు.

పాఠాలు సరిగా బోధిస్తున్నారా లేదా? అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే  మాలోతు రాందాస్‌ ‌నాయక్‌, ‌జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి పాటిల్‌, ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ ‌రాహుల్‌, ‌కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్‌ ‌రెహమాన్‌, ‌పంచాయతీరాజ్‌ ఇం‌జనీరింగ్‌ ‌శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇం‌జనీర్‌ ‌శ్రీనివాసరావు, డీఈ సత్యనారాయణ, ఇరిగేషన్‌ ‌డిఈ కిశోర్‌, ‌విద్యుత్‌ ‌శాఖ ఏడీఈ రవికుమార్‌, ఏఈ ‌సతీష్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు మంగీలాల్‌, ‌నాయకులు దుద్దుకూరు మధుసూదన్‌ ‌రావు, ఎల్లంకి పుల్లయ్య, వేల్పుల నరసింహారావు, కొర్సా రమేష్‌, ఉసికల వెంకటేశ్వర్లు, పోతురాజు నాగరాజు, ఎల్లంకి చిన్న నాగేశ్వరరావు, నున్న రంగారావు, కొడెం జోగారావు, మాచినేని సత్యనారాయణ, నర్వనేని పుల్లారావు, లచ్చు నాయక్‌, ‌మోదుగు రామకృష్ణ, నవీన్‌ ‌రాథోడ్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *