ఇజ్రాయెల్ వెల్లడి
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: తాము ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లోని కుద్స్ ఫోర్స్ కమాండ్ సెంటర్‌పై దాడి నిర్వహించినట్లు ఇజాయ్రెల్ తెలిపింది. ఈ కుద్స్ ఫోర్స్ అనేది ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న మధ్యప్రాచ్య సంస్థలకు మద్దతు అందించే ప్రత్యేక సైనిక విభాగం. ఇది నేరుగా దేశ అత్యున్నత నేత అయిన ఆయతొల్లా అలీ ఖామెనైకి నివేదించేది. ఈ దాడిలో ఎంత నష్టం జరిగిందనేది వెంటనే నిర్ధారణ కాలేదు. శుక్రవారం నుండి ఇజ్రాయెల్ ప్రారంభించిన ఆపరేషన్‌లో ఇది తాజా దాడి. ఈ సైనిక దాడుల్లో ఇప్పటి వరకు పదిమంది జనరల్స్ మరణించగా, ఆయతొల్లా ఖామెనీ తర్వాత ఇరాన్‌లో అత్యంత శక్తివంతుడైన వ్యక్తి కూడా మరణించినట్లు సమాచారం. కుద్స్ ఫోర్స్ అనేది హిజ్బుల్లా, హమాస్ వంటి ఇరాన్ మిత్రులకు మద్దతు ఇచ్చే సంస్థ. ఇది గూఢచార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తుంది. ఈ విభాగం మాజీ కమాండర్ ఖాసిం సులేమానీని 2020లో అమెరికాలో హత్యకు గురయ్యారు. కాగా, ఇజ్రాయెలీ దాడులు ఇరాన్ సైనిక పాలనా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ప్రతిగా తెహ్రాన్ ఇజ్రాయెల్‌పై వందల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఘర్షణల మధ్య ఇది అత్యంత ప్రాణనష్టం కలిగిన, ప్రత్యక్షమైన ఘర్షణగా భావిస్తున్నారు. ఇరువైపులా కూడా తాత్కాలికంగానైనా తగ్గే సూచనలు కనిపించడంలేదు. సోమవారం ఉదయం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ మధ్య భాగంలోని క్షిపణి స్థలాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగించింది. తన పౌరులను షెల్టర్లకు దగ్గరగా ఉండాలని ఇజాయ్రెల్ హెచ్చరించింది. కొన్ని గంటలకే ఇజ్రాయెల్‌లో పలు ప్రాంతాల్లో అలారంలు మోగాయి. ఇరాన్ నుండి భారీ క్షిపణుల దళం ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. టెల్ అవీవ్ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో క్షిపణులు పడినట్లు ఇజ్రాయెల్ పోలీస్ వెల్లడిరచింది. సమీప నగరమైన పేతా టిక్‌వాలో ఒక అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో కనీసం ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నాటికి టెహ్రాన్ నుండి బయలుదేరే రహదారులు కిక్కిరిసి కనిపించాయని ట్రాఫిక్ పోలీస్ అధికారి, నివాసితులు, ఇరాన్ వార్తా సంస్థలు వెల్లడిరచాయి. ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ట్రావెల్ బ్యాగ్‌లతో ఉన్న వారు టాక్సీల కోసం ఎదురుచూస్తూ కనిపించారని నివాసితులు తెలిపారు. రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న రాజకీయ చర్చలు కూడా రద్దయ్యాయి. ఇరాన్ అణు కార్యక్రమ భవిష్యత్తుపై ఆదివారం జరగాల్సిన టెహ్రాన్-వాషింగ్టన్ చర్చలు రద్దయ్యాయి. ఇజ్రాయెల్ తన సైనిక దాడుల ద్వారా ఈ అణు కార్యక్రమాన్ని కూల్చాలని భావిస్తోంది. ఇరాన్ ఆరోగ్య శాఖ ప్రకారం ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇప్పటివరకు 224 మంది మృతిచెందారు. మరో 1400 మందికి పైగా గాయపడ్డారు. అదే సమయంలో ఇరాన్ ప్రతీకార దాడులలో ఇజ్రాయెల్‌లో కనీసం 13 మంది పౌరులు మృతిచెందినట్లు తెలిసింది.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే