హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల కమిటీ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలకు సంబంధించి ఆయనకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆహ్వాన పత్రిక అందించింది. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమ్మవారి ఆశీర్వచనాలు తెలిపారు. జూలై 13న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు నిర్వహించనున్నారు.
సీఎంకు సికిందాబ్రాద్ బోనాల ఉత్సవాల ఆహ్వానం





