అం‌తర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యత..!!

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదించిన వ్యక్తి ఎక్కడ ఎప్పుడు అనేది పరిశీలిస్తే 1910లో కోపెన్‌ ‌హెగెన్‌ ‌లో సోషలిస్టు మహిళ రెండువ అంతర్జాతీయ మహాసభలు జరిగాయి. ఇందులో జర్మన్‌ ‌విప్లవకారిణి క్లారిజె జెట్కిన్‌ ‌బూర్జువా పెత్తనానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి విస్తృతంగా స్త్రీల ను కూడగట్టే  ఉద్దేశంతో మార్చి 8 ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలని ప్రతిపాదించి అంగీకరించ బడింది.

మార్చి 8వ తేదీనే క్లారాజెట్కిన్‌ ఎం‌దుకు ఏనుకున్నది అనేది సందేహం కలగవచ్చు అయితే దీనికి కారణాలున్నాయి. 1887 మార్చి 8 న అమెరికా బట్టల మిల్లులోని మహిళా కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. వీరు తమ పని గంటలను 16 నుండి 10 గంటలకు తగ్గించాలని కోరారు. ఈ విధంగా పురవీధుల్లో మహిళలు నిరసన ప్రదర్శనలు జరుపటం ఇది పెద్ద మొట్ట మొదటిసారిగా అదే విధంగా 1908 మార్చి నెలలోనే న్యూయార్క్ ‌లోని కుట్టు  కార్మికులు వేతనాల పెరుగుదల కోసం పని పరిస్థితుల మెరుగుదల కోసం వేల సంఖ్యలో బయటీ కొచ్చి సమ్మె జరిపారు.

అందుకని కార్మికవర్గ పోరాటాలకు స్త్రీ విముక్తి ఉద్యమాలకు మధ్య సంబంధం ఉండాలని నొక్కి చెబుతూ క్లారా జెట్కిన్‌  ‌మార్చి 8 ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలని మహిళలు తమ హక్కుల కోరకు పోరాడే దినంగా గుర్తించాలని ఆవిడ ప్రతిపాదించారు. అయితే ఆ రోజున ఎవరి ఆలోచనల ప్రకారం ఎట్లా జరిగినప్పటికీ ఇప్పటివరకు రష్యా, చైనా సోషలిస్టు విప్లవాలకు ముందు ఆ తరువాత అపసవ్య ధోరణులకు గురయ్యే  వరకు సోషలిస్టు విప్లవ విజయవంతంలో అటు తర్వాత సోషలిస్టు నిర్మాణంలో మహిళా దినోత్సవాల వారి పోరాటాలు  భాగం పంచుకున్నాయి.

1910 లో ఈ ప్రతిపాదన చేయడంతో 1911లో జర్మనీ, ఆస్ట్రేలియా, డెన్మార్క్ , ‌స్విట్జర్లాండ్‌ ‌లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపబడినాయి. రష్యాలో 1913న జరుపబడింది అంతేగాక ఆయాదేశాల మహిళాలు ఆటు తర్వాత మార్చి 8 ని అంతర్జాతీయ మహిళా దినం గా పరిగణిస్తూ అనేక పోరాటాలు నిర్వహించారు. మొదటి ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా 1915లో మార్చి నెలలో నే ఒస్లో లో మహిళలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. 1917 మార్చి 8న రష్యాలోని మహిళలు ‘‘శాంతి రొట్టె ముక్క’’ కావాలంటు జరిపిన ప్రదర్శనతో రష్యాన్‌ ‌విప్లవం ప్రారంభమైనది. 1937లో స్పెయిన్‌ ‌లో ప్రాంకో ఫాసిస్టు పాలకులకు 1943లో ఇటలీ లోని ముస్సోలినీ ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. 1979లో  ఇరాన్‌ అధినేత ఖొమైనీ ముస్లిం మహిళలను ‘‘బురఖా ‘‘ వేసుకొవాలని ప్రకటీస్తే అటు తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ  టెహరాన్‌  ‌లో 50 వేల మంది మహిళలు ప్రదర్శనలు జరిపి మార్చి 8న  ఇరాన్‌ ‌స్త్రీ విముక్తి దినంగా ప్రకటించారు.

బొలీవియా వంటీ దేశాలల్లోని కార్మిక వర్గ మహిళలు తమ పోరాటాలను విప్లవ పోరాటాలతో మమేకం చేసి ఈ మహిళా దినోత్సవాల సందర్భంగా మహిళలకు కొత్త ఒరవడిని అందించారు. ఐక్యరాజ్యసమితి ఆహ్వానం మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మెక్సికో  వెళ్ళి తమ ప్రతిపాదనలను వివరించారు. రష్యా చైనా మహిళలు విప్లవం ముందు ఆ తర్వాత ప్రపంచ మహిళాలు  లోకానికి విప్లవ విజయమనంతర సమస్యల పరిష్కారానికి  మార్గమని చాటి చెప్పుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని  క్లారా జెట్కిన్‌ ఆశలకు అనుగుణంగా ఉన్నదని ప్రకటించారు. 21 వ శతాబ్దంలో వచ్చిన అనేక రకాల ఉద్యమాలు దృష్టిలో ఉంచుకొని మనకు స్వాతంత్య్రం వచ్చిన గత 77 సం లలో కూడా స్త్రీలెంత వరకు అభివృద్ధి సాధించగలిగారు అంటే కొంతమేరకు అని చెప్పవచ్చు స్త్రీల అధికారం  విషయానికొస్తే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కొంత ప్రగతి పధంలోనే ఉందని కూడా చెప్పుకోవచ్చు స్వయం ఉపాధి పథకాలు సామూహిక పథకాలు పొదుపు పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల పిల్లల అభివృద్ధి పథకం( డ్యాక్రా డెవలమింట్‌ అం‌డ్‌ ఉమెన్‌ అం‌డ్‌ ‌బిల్డ్రన్‌ ఇన్‌ ‌రూరల్‌ ఏరియాలో) మొదలైన వాటి సాయంతో స్త్రీలు కొన్ని రంగాలలో ముందడుగు వేశారని చెప్పవచ్చు. సారా నిషేధం గురించి ఒకప్పుడు స్త్రీలు నడిపిన ఉద్యమం.. చేసిన ఆందోళన ఇటీవలి స్త్రీల ఉద్యమాలలో ప్రముఖంగా నిల్చిపోయింది. స్త్రీలకు ఆస్తి హక్కులు బాలికలకు ఉచిత విద్య వంటి కొన్ని విషయాలలో ముందడుగు వేసింది. ఏది ఏమైనప్పటికీ స్త్రీలు విద్యా ఉద్యోగం రాజకీయ రంగంలో కొంతమేరకు అభివృద్ధి పట్టణ ప్రాంతాల్లో తప్ప పల్లెప్రాంతాల్లో ఆశించినంత మేరకు అభివృద్ధి అనేది జరగాల్సి ఉంది.

స్త్రీలపై హింస కుల మత వర్గ విచక్షణలు లేకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. కుటుంబంలో స్త్రీలపై హింస ఆ గత రెండు దశాబ్దాలుగా అంటే ప్రపంచీకరణ నేపథ్యంలో విపరీతంగా పెరుగుతుందనే అంశాన్ని ప్రపంచమంతా అంగీకరించిన విషయమే. కుటుంబం హింసని సమూలంగా నిర్మూలించాలంటే చట్టాల వల్ల మాత్రమే సాధ్యంకాదు స్త్రీలపై హింసకి మూల కారణామైనటువంటి  పితృస్వామ్యం పేదరికం అవిద్య మద్యపానం సమూలంగా నిర్మూలించితే మాత్రమే గ్రుహహింసని అరికట్టడం కష్ట సాధ్యం. సమాజంలో మహిళలను పట్టి పీడిస్తున్న సమస్య వరకట్నం.. భారతీయ సమాజం మూఢ విశ్వాసాలతో మతఛాందస భావాలతో కూడుకొని ఉంది. దానికి తోడు నిరక్షరాస్యత.. ఈ నిరక్ష రాస్యత రూపు మాపి స్త్రీలంత విద్యావంతు లై.. ఆర్థికంగా నిలదొక్కుకుని కట్నం లేకుండా నైతనే పెళ్ళికి సిద్దపడే ఆత్మ సైర్యాన్ని పెంపొందించు కోవాలి.. అందుకోసం సమాజంలోని మహిళలంత సమైక్య పరచి మహిళ ఉద్యమాన్ని నిర్మించాలి.. అందు కోసం సమాజంలో సగ భాగంగా వున్న స్త్రీలను మేల్కోలిపి

  ‘‘మానవతే మాసిపోయి
నాగరికత పెరిగిపోయి
నిరాసక్త నిలయంగా
బతుకంతా మారిపోయి
కుళ్ళిన ఈ సంఘంలో
స్త్రీ ! స్థానం ఎక్కుడ ?
వ్యక్తిత్వ వికాసాల పరిరక్షణ కోసం .
దానికి ప్రతీకగా
మొదడున్నది మనకున్నది

ఆలోచనలను సంధింప  చేసే కర్తవ్యాన్ని గుర్తించాలి. మార్చి8 అనేది ప్రపంచంలోని సగభాగమైన మహిళలు తమ హక్కుల సాధన తమ విముక్తి సాధ్యనకు పోరాటాలు చేసే దీనంగా దీక్ష కంకణ బద్దులై పత్రిజ్ఞలు తీసుకునే  దినంగా  పరిగణించాలి.  పోరాటాలకు పునరంకితమయ్యే దినంగా భావిస్తా సమాజం లోని మూలాన్ని మహిళలకు అర్ధ చేయించి వారిలో చైతన్య స్ఫూర్తి ని కలుగ చేయాలి.. స్వయం కృషితో స్వీయ  చైతన్యంతో అజ్ఞానపు అంధకారాలను చీల్చుకుంటూ హక్కుల కై భాగస్వామ్యం వహించినవుడే  మాత్రమే స్త్రీ కి విముక్తి..

                      శోభ రమేష్‌
8978656327

( ‌మార్చ్ 8 అం‌తర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *