ప్రభుత్వంలో నిజాయితీ ఉంటే భయమెందుకు?

“ప్రముఖ ఉర్దూ కవి జియా జమీర్ రచించిన ఈ ద్విపద చరణం, నిర్ల క్ష్యంగా వ్యవహరించే అధికారం కింద నలిగిపోయే ఒక బాధితుడి గురించి వివరిస్తుంది. దీని అనువాదం, “ జరిగే ప్రతి తప్పును ఏ విధంగా భరించాలో తెలుసుకున్నాను. అధికారంతో నిండిన సువిశాల గదుల్లో నా వినతి బలంగా ఎప్పుడూ ఉండదు ”. సరిగ్గా ఇటువంటి బాధితుడి విలాపమే మన పార్ల మెంట్ భవనంలో విపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ రూపంలో ఇప్పుడు వినిపించింది. తాను చెప్పదలచుకున్నదాన్ని ప్రభుత్వం వ్యూహాత్మక అభ్యంతరాలను లేవనెత్తుతూ అడ్డుకోవడంతో నిస్సహాయంగా ఉండిపోవాల్సి రావడం, పురాతన కవితలో పేర్కొన్న నిస్సహాయ తిరస్కార భారాన్ని ప్రతిబింబిస్తోంది..”  

“కుఛ్ జులుమ్‌-ఒ సితమ్ సహనే కి ఆదత్ భీ హై హమ్ కో/కుఛ్ యే హై కీ దర్బార్ మే  సున్వాయీ భీ కమ్ హై” ప్రముఖ ఉర్దూ కవి జియా జమీర్ రచించిన ఈ ద్విపద చరణం, నిర్ల క్ష్యంగా వ్యవహరించే అధికారం కింద నలిగిపోయే ఒక బాధితుడి గురించి వివరిస్తుంది. దీని అనువాదం, “ జరిగే ప్రతి తప్పును ఏ విధంగా భరించాలో తెలుసుకున్నాను. అధికారంతో నిండిన సువిశాల గదుల్లో నా వినతి బలంగా ఎప్పుడూ ఉండదు ”. సరిగ్గా ఇటువంటి బాధితుడి విలాపమే మన పార్ల మెంట్ భవనంలో విపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ రూపంలో ఇప్పుడు వినిపించింది. తాను చెప్పదలచుకున్నదాన్ని ప్రభుత్వం వ్యూహాత్మక అభ్యంతరాలను లేవనెత్తుతూ అడ్డుకోవడంతో నిస్సహాయంగా ఉండిపోవాల్సి రావడం, పురాతన కవితలో పేర్కొన్న నిస్సహాయ తిరస్కార భారాన్ని ప్రతిబింబిస్తోంది.

అసమ్మతి గళాలను అణచివేసేవిగా రూపొందిన ప్రజాస్వామ్యానికి దేవాలయంగా పరిగణించే పార్లమెంట్‌లో పైకి మాత్రం ఈ సంఘర్షణ ముగిసినట్టు కనిపిస్తుంది. దేశభక్తిని,  భారతీయ సంస్కృతిని కాంగ్రెస్‌పార్టీ అర్థం చేసుకున్న తీరును అధికార పక్ష సభ్యులు ప్రశ్నించినప్పుడు వివాదం మొదలైంది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణె రచించిన “ఫోర్ స్టార్స్ ఆఫ్ డిస్టినీ” పుస్తకంలో పేర్కొన్న కొన్ని అంశాలపై విపక్షనేత రాహుల్‌గాంధీ ప్రభుత్వం నుంచి వివరణ కోరడానికి యత్నించారు. 2020లో భారత్ చైనాల మధ్య గాల్వన్ లోయలో జరిగిన సంఘర్షణ సమయం నాటి ఇందులో పేర్కొన్న అంశాలు, నిరంతరం దేశభక్తి గురించి మాట్లాడేవారి అసలు రంగు బయట పెడతాయన్నారు.

కానీ రాహుల్ వాదనను భాజపాకు చెందిన సీనియర్ నాయకులు అడ్డుకోవడమే కాదు రాజ్యాంగంలోని 349, 353 అధికరణల కింద, ప్రచురితం కాని పుస్తకంలోని, అనధికార అంశాలను వెల్లడించకూడదని స్పష్టం చేశారు. లోక్‌సభ స్పీకర్ కూడా సదరు సీనియర్ లీడర్లకు మద్దతుగా నిలిచారు. ఆ విధంగా అధికార పార్టీ దేశభక్తిని ప్రశ్నించే విధంగా ఉన్న  ఆ పుస్తకం లోని లైన్లను విపక్షనేత రాహుల్‌గాంధీ చదివి వినిపించలేకపోయారు. లోక్ సభ గౌరవాన్ని రాహుల్ దెబ్బతీస్తున్నారని అధికారపక్ష సభ్యులు వాదించగా,  అసలు నిజం వెల్లడవుతుందన్న భయం మీలో ఉన్నదంటూ రాహుల్ ఎదురు దాడికి దిగారు. ఈ సంఘటన లోక్‌సభలో జరుగుతున్న వర్తమాన చర్చ ల్లో నెలకొంటున్న విరోధాభాసను స్పష్టం చేస్తున్నది.

పార్లమెంట్ సమావేశా ల్లో అధికార పక్ష సభ్యులు తరచుగా విపక్ష సభ్యుల యోగ్యతకు సంబంధించిన ఆరోపణలు చేయడం అలవాటుగా మారింది. వీటికి దీటైన సమాధానాలివ్వడానికి విపక్ష సభ్యులు ప్రయత్నిస్తే వారిపై క్రమశిక్షణ, అనర్హత వేటుతో బెదిరించడం జరుగుతోంది. విచిత్రమేమంటే ఈ పుస్తకంలోని అంశాలు ఇప్పటికే జనానికి తెలిసిపోయాయి. అయితే నరవణె రచించిన చేతి వ్రాత ప్రతులు ప్రచురణకు నోచుకోకుండా ప్రభుత్వం అడ్డుపడుతోంది. విధానపరమైన పరిరక్షణ పేరుతో నోటిమాటతో దీని ప్రచురణ ఆలస్యమవుతోంది. విధానపరమైన అడ్డంకులు రాతిగోడ మాదిరిగా నిలబడినా, దర్బారులోని కవితాత్మక విలాపంలోని చేదు నిజాన్ని తప్పక భరించక తప్పదు. కానీ తనకు ఇబ్బంది కలిగించే వాస్తవాలను బహిర్గతం కాకుండా సంస్థాగతమైన గేట్లను మూసివేయడం రాజ్యం చేస్తున్న పని.

ఇప్పటికే ప్రజా సమూహాల్లోకి వెళ్లిన నిజాన్ని రూల్ బుక్ అనే ఆయుధంతో  అణగదొక్కడం ద్వారా బయటకు రాకుండా చేసినా, ప్రభుత్వం తాను చేసిన పనులకు భయపడుతోందన్నది స్పష్టమవుతోందంటూ విపక్షనేత చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉంది . ఈ పరిణామాల వల్ల విపక్షాల గొంతును నొక్కేయడం నిరంతరం సాగే ఒక ప్రక్రియగా మారిపోవడంతో, పార్లమెంట్ లో సమతుల్యత దెబ్బతింటోంది. ముఖ్యంగా అధికార పక్షం తన ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి ఎంతమాత్రం అంగీకరించడంలేదన్న సత్యం వెల్లడవుతోంది. అంతేకాదు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె పుస్తకాన్ని ప్రచురించకుండా ఆలస్యం చేస్తుండటం నిర్మాణాత్మక సెన్సార్‌షిప్ కాకపోతే మరేంటి? విధానపరమైన సాంకేతికలు, పాలనాపరమైన జడత్వ రూపంలో ఈ సెన్సార్‌షిప్ విధింపు కొనసాగుతోంది. ఇంతవరకు ఈ పుస్తకం ప్రచురితం కాలేదు, “గ్రే జోన్‌”గా ప్రకటించలేదు. ఒకవేళ ఆ విధంగా ప్రకటించినట్లయితే అధీకృత డాక్యుమెంట్లను సమర్పించాలని కోరడానికి ప్రభుత్వానికి అవకాశముండేది.

    ప్రస్తుతం కనిపిస్తున్న మార్పును పరిశీలిస్తే,  చట్టసభల్లో నిజాలను వెల్లడించడం కంటే, అనుమతుల‌కే ప్రాధాన్యమన్న వాస్తవం వెల్లడవుతోంది.   లోక్‌సభలో విపక్షనేతను ఎందుకని మాట్లాడనివ్వలేదంటే, దీనికి సంబంధించిన ప్రధానవనరు (నరవణె రచన) ఉనికిలోకి రావడానికి ప్రభుత్వం ఇంకా “అనుమతించలేదు”. దీనివల్ల “జరిగే ప్రతి తప్పు భారాన్ని” విపక్షాలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా లోక్‌సభ కేవలం అధికార పక్షం తన ఏకపక్ష వాదనలకు మాత్రమే పరిమితం కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో తన ప్రతిబింబాన్ని చూసుకునే వీలెక్కడ? అధికార పక్షంలో భయం ఉన్నది కనుకనే  నిబంధనల పేరుతో లోక్‌సభలో అడ్డుతగులుతున్నది. ఒకవేళ పుస్తకంలో అభ్యంతరకర అంశాలుంటే ప్రభుత్వం వాటిని స్పష్టంగా పేర్కొనవచ్చు కదా! కానీ అసలు ఆ టెక్ట్స్‌నే చదవడానికి ప్రభుత్వం అంగీకరించడంలేదంటే, దాని ప్రచురణ లో జరుగుతున్న జాప్యానికి ప్రభుత్వం కావాలనే వ్యూహాత్మకంగా అడ్డుకోవడం కారణమని అర్థం చేసుకోవాలి. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే పార్లమెంట్ చర్చలకు కేంద్రస్థానంగా కాకుండా ఏకపక్ష వాదనలకు వేదికగా మారుతున్నదని అర్థమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో విపక్షాలు కేవలం తప్పుల భారాన్ని మోయడమే కాకుండా, తమ వినతులకు ఎటువంటి విలువ ఇవ్వని దుస్థితిని ఎదుర్కోక తప్పదు!
-శామ్ సుందర్ 
పొలిటికల్ అనలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *