హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్లాగ్‌షిప్ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక సీఎస్‌గా సబ్యసాచి ఘోష్ నియమితులయ్యారు. అలాగే సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌గానూ ఆయన కొనసాగనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రవాణా శాఖ కమిషనర్‌గా కె.ఇలంబర్తిని నియమించిన ప్రభుత్వం పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్యదర్శి బాధ్యతలు సీఎస్ వద్దే ఉంచింది. జీఏడీ కార్యదర్శిగా ఇ.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చింది. టీజీ ఆయిల్‌ఫెడ్ ఎండీగా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు అప్పగించిన సర్కార్.. ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా జి.జితేందర్‌రెడ్డిని నియమించింది. అలాగే ఎస్సీ సహకార సంస్థ ఎండీగా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



