అంతర్జాతీయ టోర్నీలకు కేరాఫ్ హైదరాబాద్

– ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: మన జాతీయ క్రీడ అయిన హాకీ కి పునర్వై భవం తెచ్చేందుకు, హాకీ లో మహిళల భాగస్వామ్యం పెంచడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వరల్డ్ మహిళల హాకీ క్వాలిఫైంగ్ మ్యాచ్ లను గచ్చిబౌలిలో నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు అంతర్జాతీయ మహిళల హాకీ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ సందర్భంగా శనివారం గచ్చిబౌలి స్టేడియంలో ఈ పోటీలో పాల్గొంటున్న ఎనిమిది జట్ల కెప్టెన్లతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన జాతీయ క్రీడ హాకీ కి పునర్ వైభవం తీసుకురావడానికి క్రీడల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విధంగా స్ఫూర్తి కలిగించడానికి అంతర్జాతీయ మహిళా హాకీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోని బాలాదేవి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ క్రీడా శాఖ సహకారంతో గచ్చిబౌలి హాకీ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ కు కావలసిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయగలిగామని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *