హోం శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆనంద్‌ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: తెలంగాణ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సి.వి.ఆనంద్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఆనంద్‌ ఇప్పటివరకు సిటీ పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ఇది ఆయనకు రెండోసారి. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌గాకూడా పనిచేశారు. మంగళవారం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *