హోలా హోలాల హోలీ రంగ హోలీ
జనుల హో హోల కేళీల హోలీ
హోలీ హోలాలి యశోద కృష్ణ డోలి
మా గుండెల్లో నిలవాలి ఆనంద కేళీ
ఉల్లాసంగా ఊరంతా వసంత మాడాలి
ఇంద్ర ధనస్సు రంగుల్లో మనమంతా తడవాలి
సప్త రంగులన్నీ కలిసి ఏకమవ్వాలి
నీరంతా జలధిలో కలిసినట్టు ఒక్కటవ్వాలి
హోలిక బూడిదయ్యింది మంటల్లో కాలి
వేమన యోగి అయ్యే తాను భోగము వదిలి
మన్మధుడు ముక్కంటి క్రోధాగ్నిలో కాలి
భస్మం బయ్యే ప్రాణాలు వదిలి
స్తంభించే లోకాన కామతాపాల కేళీ
పూల భానుడు లేక లేదు మదనకేళీ
రతీ దేవి ప్రార్థించే భర్తప్రాణాలు శివుని దయకు వదిలి
బ్రతికే మన్మధుడు అశరీరుడై దేహము వదిలి
ప్రకృతి పులకింతల రంగుల చమకేళీ
మదనోత్సవములో మునుగుచుండే జనావలి
ఇది వసంత కేళీ రంగుల చమకేళీల హోలీ
(మార్చ్ 14, హోలి సందర్భంగా)
` పి.బక్కారెడ్డి
9705315250
వసంత కేళి రంగుల హోలీ





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల