హైదరాబాద్‌లోపలు చోట్ల ఈదురు గాలులతో వానలు
అప్రమత్తంగా ఉండాలని జిహెచ్‌ఎంసి సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. ఉదయం నుంచే వాతావరణం చల్లబడగా.. సాయంత్రానికి వర్షం మొదలైంది రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో గురువారం మధ్యాహ్నం నగరమంతా చల్లని వాతావరణం ఏర్పడింది. ఉక్కపోత నుంచి నగర ప్రజలకు ఉపశమనం కలిగింది. వారం రోజుల క్రితం వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అయ్యాయి. మళ్లీ ఇవాళ కాస్త ఎండలు నెమ్మదించాయి. మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మేడ్చల్, గగిల్లాపూర్ తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. ఎస్‌ఆర్ నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. నగరంలో రానున్న 48 గంటల పాటు- ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.
ఇదిలావుంటే రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు- ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోవి•టర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబా బాద్, భదాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే సూచనలున్నాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీచేసినట్లు తెలిపింది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడగళ్ల వాన కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోవి•టర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఈ గాలి దుమారానికి పలు ప్రాంతాల్లోని భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది.
అలాగే భారీ వర్షాలు, ఈదరుగాలులు నేపథ్యంలో మాన్‌సూన్, డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు- వివరించింది. విపత్కర పరిస్థితులు ఎదురైతే.. వెంటనే జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 040-2111-1111కు కాల్ చేయాలని నగర వాసులకు సూచించింది. ఆఫీసులు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లే వాహనదారులు చాలా జాగ్రత్తతో వెళ్లాలని అప్రమత్తం చేసింది. అలాగే కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిలువ వద్దని ప్రజలకు తెలిపింది. ఐటీ- కారిడార్‌లోని ఉద్యోగాలు ఒకే సారి రోడ్లపైకి రావొద్దని నగర ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఓ వేళ వి•రు వెళ్లే రహదారుల్లో భారీగా ట్రాఫిక్ ఉంటే.. 100కు కాల్ చేసి.. మీరు ఏ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారో చెబితే.. ఆ పీఎస్ పరిధిలోని పోలీసులు నిమిషాల్లో అక్కడి చేరుకొని.. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తారని ట్రాఫిక్ విభాగం పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.