రాగల నాలుగు రోజులు భారీ వర్షాలు

– హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరిక

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ‌రాష్ట్రంలోరాగల నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ ‌హెచ్చరికలు జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌, ‌వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ ‌హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మంచిర్యాల, నిర్మల్‌, ‌కొత్తగూడెం, మహబూబాబాద్‌ ‌జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *