- 238 ప్రాంతాల్లో నేటి నుంచి పైలట్ సర్వే
- ప్రారంభించనున్న సిఎం రేవంత్ రెడ్డి
కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డు ప్రొఫైల్ రూపకల్పన ప్రక్రియను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నది. ఈ మేరకు డిజిటల్ హెల్త్ కార్డును అమల్లోకి తీసుకుని రాబోతున్నది. ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలందరికీ హెల్త కార్డుల వివరాలు పొందు పర్చనుంది. ఈ మేరకు గురువారం పైలెట్ ప్రాజెక్ట్‌ను సిఎం రేవంత్ ప్రారంభిస్తారు. మరోవైపే ఈ అంశంపై చర్చించిన రెవెన్యూ , గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ప్రతి కుటుంబానికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి, ప్రత్యేక నంబరుతో స్మార్ట్ కార్డులివ్వనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో పైలట్ సర్వే నిర్వహిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభిస్తారు. అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఈ కార్డుల కోసం పొరపాట్లకు తావు లేకుండా వివరాలు నమోదు చేయించాలని కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించారు. నియోజకవర్గంలో ఒక పట్టణ, ఒక గ్రావిూణ ప్రాంతాన్ని ఎంచుకుని ఎన్యుమరేషన్ చేపడతారు.. ఒకవేళ పూర్తిగా అర్బన్ ప్రాంతమైతే రెండు వార్డులు/డివిజన్లు ఎంచుకుంటారు. ప్రతి నియోజకవర్గానికి ఆర్డీవో స్థాయి, జోనల్ కమిషనర్ స్థాయి అధికారులను, మండలానికైతే ఒక తహసీల్దారును ప్రత్యేకాధికారులుగా నియమించారు. కుటుంబసభ్యుల వివరాల నమోదు, మార్పుచేర్పుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా డిజిటల్ సర్వేకు అధికారులు రంగం సిద్దం చేశారు.





