ఎన్నికల కోసమే ఇందిరమ్మ చీరలు

– అరకొరగా పంపిణీ
– మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం మాటేంటి?
– స్త్రీ నిధికి వ‌డ్డీ లేని రుణాలివ్వాలి
– మ‌హిళ‌ల‌కు వెయ్యి మెగావాట్ల సౌర‌ విద్యుత్ మాటేంటి?
– సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్‌రావు విమ‌ర్శ‌

సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 25:  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ హెచ్ జీ గ్రూప్ లో ఉన్న సుమారు 46 లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారు.. అదే కేసీఆర్‌ ప్రతి బ‌తుక‌మ్మ పండుగ‌కు 18ఏండ్లు నిండిన కోటి 30వేల మహిళలకు చీరలు అందించారని సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు మంగ‌ళ‌వారం వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 3లక్షల 83వేల మంది మహిళలు ఉంటే లక్షా 99వేల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారన్నారు. ఒక్క ఏడాదికి మాత్రమే చీర ఇచ్చి సారె పెట్టిన అంటున్నారన్నారు. ఒక్క చీర ఇచ్చాను.. సర్పంచ్ ఎన్నికల్లో ఆడోళ్ళంత ఓట్లు గుద్దుండ్రి అని రేవంత్ రెడ్డి అంటున్నాడ‌ని ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రేవంత్ రెడ్డి ఇస్తానన్న నెలకు రూ.2500 సంగతి ఏందీ?  రెండేళ్లలో రూ.60వేలు ఇచ్చి సారె పెట్టాలి. రెండు చీరలు ఇస్తామని ఒకటే ఇచ్చిన నీకు మహిళలు ఎందుకు ఓటెయ్యాలని ప్ర‌శ్నించారు. పట్టణంలో ఎన్నికలు లేవు కాబట్టి చీరలు లేవు.. వడ్డీ లేని రుణాలు లేవని ఆయ‌న అన్నారు. మహిళా సంఘాలు రూ.25వేల కోట్ల రుణాలు తీసుకుంటే రూ.5 వేల కోట్లకు మాత్రమే వడ్డీ లేని రుణం వస్తుంది. మొత్తం డబ్బులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. గతంలో స్త్రీ నిధి కింద వడ్డీ లేని రుణాలు ఇచ్చాము.. ఇప్పుడు ఆ వడ్డీ ఋణం ఇవ్వడం లేదు. స్త్రీ నిధికి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్న.. మీ పక్షాన అసెంబ్లీలో కూడా మాట్లాడతా అన్నారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇస్తానన్న  ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలోని మహిళా సంఘాలకు ఒక్క ఆర్టీసీ బస్సు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామని నేటికి రెండేళ్ల‌యినా ఒక్క మెగావాట్ పవర్ ఎక్కడా కూడా పెట్టలేదు. కేసీఆర్‌ పండగ పండగకి సంక్షేమ పథకాలు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్ల ఓట్లకు సంకేమ పథకాలు ఇస్తున్నారు.  రైతు బంధు, వ‌డ్డీ లేని రుణాలు, చీరల పంపిణీ అన్నీ ఓట్ల‌ కోస‌మే. రుణ మాఫీ సగం ఇచ్చిండు ..సగం ఎగొట్టిండు. ఆశ పెట్టడం.. ఆయాస పెట్టడం, మభ్యపెట్టడం.. మోసం చేయడం ఈ ముఖ్యమంత్రి కి అలవాటుగా మారింద‌ని హ‌రీష్‌రావు విమ‌ర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *