రూ.11వేల కోట్లతో హ రోడ్ల నిర్మాణం

– మొత్తం 32 ప్యాకేజీల్లో 400 రోడ్లు
– టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లూ పాల్గొనవచ్చు
– మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: వచ్చే రెండేళ్లలో దేశానికే రోల్‌ మోడల్‌ రోడ్లు తెలంగాణలో నిర్మిస్తామని, అద్దం లాంటి రోడ్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా తెలంగాణ నిలవబోతోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రూ.11వేల కోట్లతో హామ్‌ రోడ్లు చేప‌ట్ట‌నున్నామ‌ని, పనులు 2026 నూతన సంవత్సరంలో ప్రారంభమవుతాయన్నారు.మొత్తం 32 ప్యాకేజీల్లో 400 రోడ్లు నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లూ పాల్గొనవచ్చునన్నాన్నారు. హ్యామ్‌ రోడ్ల నిర్మాణంలో, బిల్లుల చెల్లింపులో ఆర్‌అండ్‌బి శాఖకు పూర్తి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో మాట్లాడి ఆర్‌అండ్‌బి చిన్న కాంట్రాక్టర్లకు రూ.100 కోట్ల పెండిరగ్‌ బిల్లుల చెల్లింపునకు మంత్రి వెంకట్‌రెడ్డి కృషి చేశారు. మిగతా రూ.50 కోట్ల పెండిరగ్‌ బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం నుండి పెండిరగ్‌లో ఉన్న బిల్లులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న కాంట్రాక్టర్లకు తీపి కబురు చెప్పారు. ఏళ్లతరబడి పెండిరగ్‌లో బిల్లులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, అందుకు కృషి చేసిన మంత్రి కోమటిరెడ్డికి బిల్డర్స్‌ అసోసియేషన్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *