గూండ్ల వెంకట నారాయణ

ద్రావిడ సాహిత్యోద్యమం రావటానికి సూచనలు కనిస్తున్నాయి. ఆత్మగౌరవ పోరాటంగా మొదలయిన ద్రావిడ ఉద్యమం భాషా, సామాజిక, రాజకీయాల్లో తన ప్రభావం బలంగా చూపించింది. కానీ సాహిత్యంలో ఉద్యమంగా ప్రభావం చూపలేదు. భావజాలంగా మాత్రమే చూపిస్తూ వచ్చింది. అయితే ఈ ప్రభావం తెలుగువారికి మరీ తక్కువ. తెలుగునాట ద్రావిడవాదం గురించి ఎక్కువ చర్చలు జరగలేదు. ఇందుకు మరోకారణం ద్రావిడ అనగానే తమిళమనే మూసప్రచారం అధికంగా ఉండటం వలన కావచ్చు. ఇది తమిళవాళ్ళది గానే కాక మిగతా ద్రావిడ భాషా కుటుంబాలకు చెందినదిగా కూడా భావించాలి. ప్రస్తుతకాలంలో సాంస్కృతిక రాజకీయ ఆధిపత్యం నడుస్తుంది. దీన్ని ఎదుర్కొనటానికి ద్రావిడ సాహిత్యోద్యమమే సరైనది. ఇదంతా ఒక ప్రాచీన బలమైన పీడిత జాతి ఐక్యతకు కూడా వేదిక అవుతుంది.

గూండ్ల వెంకట నారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *