– 148 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
– 80 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు రంగం సిద్ధం
– నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వానాకాలం సీజన్‌లో 148 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉంటుందని తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాల శాఖ కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ 67.57 లక్షల ఎకరాల్లో వరి సాగు అయితే అందులో 40.75 లక్షల ఎకరాల్లో సన్నాలు, 26.82 లక్షల ఎకరాల్లో దొడ్డు వడ్లు సాగు అయ్యాయన్నారు. ఇందులో సన్నాలు 90.46 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 57.84 లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం 148.30 లక్షల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇంత పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడి అరుదైన రికార్డుగా అభివర్ణించారు. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని అరుదైన రికార్డు నెలకొల్పిన ఘనత రైతాంగానికి చెందుతుందన్నారు. కొనుగోళ్లలోనూ రాష్ట్రం యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. కనిష్ఠ మద్దతు ధర కింద కొనుగోలు మొత్తానికి రూ.21,112 కోట్ల్లు అబుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇందులో నేరుగా రైతులకు చెల్లింపుల కింద రూ.19,112 కోట్లు ఖర్చు కానున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం సబ్సిడీ నిమిత్తం చెల్లించాల్సిన రూ.6,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధర చెల్లించడంలో జాప్యం లేకుండా ఉండేందుకు దోహదపడుతుందన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో రైతాంగం రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి చేసిన నేపథ్యంలో కొనుగోAష్ట్రajఱ చెల్లింపులలో ఆలస్యం కాకుండా చూడాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. సన్నాలు పండిరచిన రైతులకు అందించే రూ.500ల బోనస్‌ను ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే వానాకాలం, యాసంగి పంటలకు రైతులకు బోనస్ చెల్లింపులకు రూ.3,159 కోట్లు అవసరం ఉందన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గిడ్డంగుల కొరత ఉండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్‌సీఐ అధ్వర్యంలోని గిడ్డంగులు 22.61 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం ఉండగా ఇప్పటికే 21.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలతో అవి నిండి పోయాయన్నారు. కేవలం 0.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంచేందుకే ఖాళీ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వాటిల్లోని బాయిల్డ్ రైస్‌ను వినియోగించే రాష్ట్రాలకు సత్వరమే తరలించాలని కేంద్ర ఆహార, వినియోగదారుల శాఖ మంత్రి, ఎఫ్‌సిఐ సీఎండీలకు లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ సాధించిన రికార్డును కేంద్రం గుర్తించి సహకరించాలని కోరారు. కొనుగోళ్ల అంశంలో అధికారులు ఎఫ్‌సిఐతో సమన్వయం చేసుకుని ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డైరెక్టర్, తదితర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





