అంగరంగ వైభవంగా భట్టి కుమారుడి వివాహం

– నూతన వధూవరులకు గవర్నర్, సీఎంల ఆశీర్వాదం
– ఖర్గే, డీకే, మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు, సినీ నటులు హాజరు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని జీఎంఆర్ ఎరేనాలో గురువారం జరిగిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య- సాక్షిల వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 9 గంటల నుంచే ప్రారంభమైన ఈ వేడుకకు దేశ, రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, సినీ రంగ దిగ్గజాలు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో వివాహ వేదిక సందడిగా మారింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన హోదాను పక్కన పెట్టి, వచ్చిన ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి పేరుపేరునా పలకరించడం విశేషం. వారితో కలిసి ఫోటోలు దిగుతూ, కుశల ప్రశ్నలు అడుగుతూ వారి పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల రాకతో జీఎంఆర్ ఎరీనా పరిసరాలు కోలాహలంగా మారాయి.

హాజరైన ప్రముఖులు

రాజకీయ ప్రముఖులు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ సీఎం వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్, కర్ణాటక మంత్రి బోసురాజు. మాజీ ఎంపిలు కేవీపీ రామచంద్రరావు, కనుమూరి బాపిరాజు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కాంగ్రెస్ ఎస్సి డిపార్టుమెంట్ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండ ప్రకాష్, అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హోం శాఖ మాజీ మంత్రి కె.జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరయ్యారు.
ప్రతిపక్ష నేతలు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ, సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేత, మాజీ ఎంపి మధు, సీడబ్ల్యూసీ మెంబర్ టి.సుబ్బిరామిరెడ్డి, రుద్రరాజులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
బీజేపీ నేతలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.

సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, హీరో శ్రీకాంత్, ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, సంగీత, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినీ దర్శకుడు వి.వి.వినాయక్, తదితరులు హాజరయ్యారు.

ఇత‌ర ప్ర‌ముఖులు: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ మంత్రి కొండ్రు మురళి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, వెన్నెల గద్దర్, మధ్య‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ దంపతులు, వైస్సార్సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.

 


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *