– రూ.కోటి చెక్కులను అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి సాయం అందజేసింది. దీంతోపాటు గత ఏడాది అక్టోబరులో విధి నిర్వహణలో ఉండగా దుండగుల చేతిలో కత్తిపోటుకు గురై మృత్యవాతపడిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. ఈ సహాయాలకు సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి ఎ. sవంత్ రెడ్డి స్వయంగా నిజామాబాద్‌లో ఆ కుటుంబాలకు శుక్రవారం స్వయంగా అందజేశారు. నిజామాబాద్‌లో జనవరి 23న అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా సౌమ్య ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్రమ రవాణాదారులు ఆమెను వాహనంతో ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడడంతో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ సౌమ్య మృతిచెందిన విషయం విదితమే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





