రెండో రోజు పెట్టుబడుల వెల్లువ

-ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌డేటాసెంటర్లు
-ఫార్మా సెక్టార్‌ ‌క్లీన్‌ ఎనర్జీ లో భారీ ప్రాజెక్టులు
-సీఎం కార్యాలయం వెల్లడి

తెలంగాణ రైజింగ్‌ ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌లో రెండో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వొచ్చాయి. వారితో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు పెంపునకు వచ్చిన భారీ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడనున్నాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌, ‌డేటా సెంటర్లు, ఔషధ రంగం, క్లీన్‌ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ ‌వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇన్‌‌ఫ్రాకీడిసి పార్కస్ 150 ఎకరాల్లో 1గిగావాట్‌ ‌సామర్థ్యం గల భారీ డేటా పార్క్ అభివృద్ధి చేపట్టుందుకు రూ. 70 వేల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది.  జెసీకేఇన్ఫా ప్రాజెక్టస్ ‌లిమిటెడ్‌ ‌రూ.9 వేల కోట్ల పెట్టుబడితో పెద్ద స్థాయి డేటా సెంటర్ల నిర్మాణం చేపడుతోంది. దీంతో సుమారు 2 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఏజీపీ గ్రూప్‌ ‌మొత్తం రూ.6,750 కోట్ల పెట్టుబడితో  1గిగావాట్‌ ‌డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.బయోలాజికల్‌ ఈ ‌లిమిటెడ్‌ (‌బీఈ) టీకాలు, పరిశోధన-అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా రూ.3,500 కోట్ల కొత్త పెట్టుబడి ప్రకటించింది. గత పెట్టుబడితో కలిపి మొత్తం రూ.4 వేల కోట్లు అవుతుంది. 3 వేలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి.ఫెర్టిస్‌ ఇం‌డియా ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌రూ.2 వేల కోట్ల పెట్టుబడితో తెలంగాణలో అధునాతన ఆహారం వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనుంది. దీంతో 800 పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్థిర వ్యవసాయానికి అవసరమైన పోషకాలు, బయో ఉత్పేర్రకాలు తయారీకి రూ.200 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించారు.వింటేజ్‌ ‌కాఫీ అండ్‌ ‌బెవరేజెస్‌ ‌లిమిటెడ్‌ ‌ఫ్రీజ్‌?‌డ్రైడ్‌ ‌కాఫీ ప్లాంట్‌ ‌స్థాపనకు రూ.1,100 కోట్ల పెట్టుబడితో  యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వెయ్యి మంది వరకు  ఉద్యోగావకాశాలు  లబించనున్నాయి. రిలయన్స్ ‌కన్స్యూమర్‌ ‌ప్రోడక్టస్ ‌లిమిటెడ్‌ ‌రూ.1,500 కోట్ల పెట్టుబడితోఏర్పాటు చేయబోయే యూనిట్‌ ‌ద్వారా వెయ్యి మందికి  ఉద్యోగావకాశాలు రానున్నాయి.  ఎలక్టాన్రిక్‌ ‌తయారీ సేవల విస్తరణలో కేన్స్ ‌టెక్నాలజీ ఇండియా లిమిటెడ్‌ ‌రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదించింది.ఆర్సీసీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌మూడు విడతల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 1,600 కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.    పర్వ్యూ గ్రూప్‌ 50 ‌మెగావాట్ల సామర్థ్యం గల గ్లోబల్‌ ‌కెపాసిటీ, ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా 3 వేల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది.అరబిందో ఫార్మా రూ.2 వేల కోట్లతో విస్తరణ చేపట్టి 3వేలకి పైగా ఉద్యోగాలు సృష్టించనున్నా రు.హెటెరో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు రూ.1,800 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. దీంతో 9వేలకి పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు సృష్టించనున్నారు.గ్రాన్యూల్స్ ఇం‌డియా రూ.1,200 కోట్ల పెట్టుబడితో 2,500-3వేల మందికి ఉపాధి కల్పించనుంది.భారత్‌ ‌బయోటెక్‌ ‌రూ.1,000 కోట్ల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చేస్తోంది. దీంతో 200లకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆహార పానీయాల తయారీ విస్తరణలో కేజేఎస్‌ ఇం‌డియా రూ.650 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది.  ఈ యూనిట్‌ ‌ద్వారా 1,551 మందికి ఉపాధి దొరకనుంది.
గోద్రెజ్‌ ఇం‌డస్ట్రీ ‌గ్రూప్‌ ‌రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు రూ.150 కోట్ల పెట్టుబడితో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్‌ ‌ద్వారా 300 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఆక్వెలాన్నెక్సస్‌ ‌లిమిటెడ్‌ ‌తెలంగాణలో క్లీన్‌ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్‌ ‌జీరో ఉద్గారాల డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది. పర్యాటక రంగంలో రూ.7,045 కోట్ల భారీ పెట్టుబడులు రానున్నాయి ప్రత్యక్షంగా 10 వేల మందికి,పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుంది. ఫుడ్‌ ‌లింక్‌ ఎఫ్‌అం‌డ్‌బీ హోల్డింగ్స్ (ఇం‌డియా) ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌  ‌రూ.3,000 కోట్లు పెట్టుబడులతో ముందుకొచ్చింది.  డ్రీమ్‌వాలీ గోల్ఫ్ అం‌డ్‌ ‌రిసార్టస్  ‌రూ.1,000 కోట్లతో నిర్మించనున్నారు. సారస్‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌రూ.1,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి.  అట్మాస్ఫియర్‌ ‌కోర్‌ ‌హోటల్స్ (‌మాల్దీవులు)  రూ.800 కోట్లు,  కేఈఐ గ్రూప్‌ (‌కామినేని గ్రూప్‌) ? ‌రూ.200 కోట్లు, పోలిన్‌ ‌గ్రూప్‌ (‌టర్కీ), మల్టీవర్స్ ‌హోటల్స్ ‌రూ.300 కోట్లు,  ఫ్లుడ్రా ఇండియా (స్పెయిన్‌)  ‌రూ.300 కోట్లు, శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌  ‌రూ.300 కోట్లు, రిధిరా గ్రూప్‌ ‌రూ.120 కోట్లు, సలామ్‌ ‌నమస్తే దోసా హట్‌ (ఆస్టేల్రియా), విశాఖ రిక్రియేషన్‌ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌రూ.25 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌ఫిల్మ్ అం‌డ్‌ ‌యానిమేషన్‌  ఐఫా ఉత్సవం, ఏథెన్స్ ఈవెంట్ల భాగస్వామ్యం ద్వారా రాష్ట్రానికి రూ.550,600 కోట్ల ఆర్థిక లాభం చేకూరనుంది. టిడబ్ల్యూఐ గ్రూప్‌ ‌ప్రపంచంలోనే తొలి ప్లగ్‌-ఇన్‌ ‌హైబ్రిడ్‌ ‌మోటార్‌బైక్‌ ‌తయారీ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు. రూ.1,100 కోట్లు పెట్టుబడితో 500 మందికి ఉద్యోగాల కల్పన అవకాశాలు రానున్నాయి. మహీంద్రా అండ్‌ ‌మహీంద్ర జహీరాబాద్‌ ‌యూనిట్‌ ‌విస్తరణకు నాలుగేళ్లలో రూ.500 కోట్లకు పైగా  పెట్టుబడికి ముందుకొచ్చింది. ఇండియా ఎక్స్ ‌ట్రీమ్‌ అడ్వెంచర్‌20 ఎకరాల్లో ఎక్స్ ‌ట్రీమ్‌ ‌స్పోర్టస్, అడ్వెంచర్‌, ఈ-‌స్పోర్టస్ అరేనా. మొత్తంగా రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టింది. బయోవరంటిష్యూ ఇంజినీరింగ్‌, ‌రెజెనరేటివ్‌ ‌మెడిసిన్‌, ‌సెల్‌జీన్‌ ‌థెరపీకి ప్రత్యేక కేంద్రం  రూ. 250 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. జ్యూరిక్‌ ఇన్షూరెన్స్ ఇం‌డియాలో తొలి గ్లోబల్‌ ‌కెపాబిలిటీ సెంటర్‌ ‌కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంది. మూడేండ్లలో   దశలవారీగా విస్తరించనున్నారు.
కెనడియన్‌ ఇం‌పీరియల్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ‌కామర్స్ ‌తమ తొలి భారతీయ సంస్థను హైదరాబాద్‌లో స్థాపించ నున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఇం‌జినీరింగ్‌ ‌సైబర్‌ ‌హబ్‌గా అభివృద్ధి  చేయడమే లక్ష్క్యంగా పేర్కొంది.మాక్సిమస్‌ (అమెరికా) గ్లోబల్‌ ‌పబ్లిక్‌ ‌సెక్టార్‌ ‌టెక్నాలజీ ఆపరేషన్స్ ‌హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. జీఎంఆర్‌ ‌స్పోర్టస్ ‌ఫ్యూచర్‌ ‌సిటీ ప్రాజెక్ట్ ‌లో భాగంగా శాటిలైట్‌ ‌స్పోర్టస్ ‌సిటీ అభివృద్ధి చేయనున్నారు. అనలాగ్‌ ఏఐ (అలెక్స్ ‌కిప్‌మాన్‌) ‌హైదరాబాద్‌లో గ్లోబల్‌ ‌పరిశోధన ప్రోటోటైపింగ్‌ ‌ల్యాబ్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఆల్ట్ ‌మిన్‌  ‌బ్యాటరీ ముడి పదార్థాల తయారీ కేంద్రం ప్రతిపాదించారు. అజయ్‌ ‌దేవగన్‌ ‌ఫిల్మ్ ‌స్టూడియోలో  స్టూడియోలు, వీఎఫ్‌ ఎక్స్, ‌వర్క్ ‌షాప్‌లు వంటి ఫిల్మ్ ఎకోసిస్టమ్‌నుపీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయనున్నారు. దీంతో   యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. తెలంగాణ,యూఏఈ,ఆఫ్రికా పెట్టుబడి భాగస్వామ్యాల కోసం చర్చించారు. బహుళరంగ పెట్టుబడి డెస్క్ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకునేందుకు పరిశీలించారు.
బ్లాక్‌స్టోన్‌ ఆసియా డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ ‌పార్కులు, కమర్షియల్‌ ‌స్పేస్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. సత్త్వ గ్రూప్‌ ‌సమగ్ర పట్టణ అభివృద్ధి, స్టూడెంట్‌, ‌సీనియర్‌ ‌లివింగ్‌ ‌ప్రాజెక్టులపై చర్చించారు.బ్రిగేడ్‌ ‌గ్రూప్‌ ‌సమగ్ర టౌన్‌షిప్‌ ‌ప్రతిపాదనపై చర్చ. ఫ్యూచర్‌ ‌సిటీలో ల్యాండ్‌ అలాట్మెంట్‌పై ప్రభుత్వం ఆసక్తి కనబరిచింది.సుమధుర గ్రూప్‌ ‌కొత్త టౌన్‌షిప్‌, ‌మధ్యతరగతి నివాస సముదాయాల ప్రతిపాదించారు.విజ్జీ హోల్డింగ్స్ ‌మల్టీ ఒమిక్స్, ‌డిజిటల్‌ ‌ట్విన్‌, ‌ప్రిసిషన్‌ ‌హెల్త్ ‌పరిశోధన కోసం ఆధునిక కేంద్రం ప్రతిపాదించారు. ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లు  ఫిఫా  ఏఐఎఫ్‌ఎఫ్‌ ‌ఫుట్‌బాల్‌ అకాడమీ టాలెంట్‌  అభివృద్ధికి  ప్రపంచ స్థాయి అకాడ హైదరాబాద్‌లో స్థాపించనున్నారు. తెలంగాణను గ్లోబల్‌ ‌హాకి హబ్‌ ‌గా  మార్చేందుకు హాకీ మహిళల వరల్డ్ ‌కప్‌ ‌క్వాలిఫైయర్‌2026 ‌ను 8 దేశాలు పాల్గొనే అంతర్జాతీయ పోటీని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు. 18 దేశాలు పాల్గొనే ఏషియారోయింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌ 2026  ‌నిర్వహించనున్నారు.హైదరాబాద్‌ ఇం‌టర్నేషనల్‌ ‌చెస్‌ ‌ఫెస్టివల్‌ 2026  ‌ప్రపంచంలోనే అతిపెద్ద చెస్‌ ఉత్సవం కానుంది.
———–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *