మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల్లో మంత్రిశ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : తెలుగువారు ఎక్కడున్న వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) దశాబ్ది ఉత్సవాలలో మంత్రి శ్రీధర్ బాబు (Duddilla Sridhar babu) పాల్గొన్నారు. పదేళ్లు పూర్తి చేసుకున్న అసోసియేషన్ కు తెలంగాణ ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు తెలిపారు. ఈసంద్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ఇక్కడికి వొచ్చామని, రాష్ట్రానికి వెళ్తే మా సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ మనవాళ్లు ఉన్నా వాళ్ల కష్టసుఖాల్లో మేము పాలు పంచుకోవాలనుకుంటామని తెలిపారు. మీ ప్రయాణంలో మా వంతు సహకారం ఉండాలని ఇంతదూరం వొచ్చామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజలు భవిష్యత్ లో అన్ని దేశాల్లో అన్ని రంగాల్లో ముందు ఉండాలి ఆకాంక్షిస్తున్నామని, ఇక్కడ ఉన్న తెలంగాణ వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.





