– డ్రగ్స్ ఓవర్ డోస్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 6: డ్రగ్స్ భూతం యువతను పట్టిపీడిస్తోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న అనేక మంది డ్రగ్స్ భూతానికి బలైపోతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటూ తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో తరచుగా డ్రగ్స్ పట్టుబడటం కూడా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో ఒక విధంగా సిటీలోకి డ్రగ్స్ ఎంటరవుతూనే ఉంది. తాజాగా డ్రగ్స్ తీసుకుని ఓ వ్యక్తి మరణించడం సంచలనంగా మారింది. డ్రగ్స్ ఓవర్ డోస్‌తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రాజేంద్రనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొబైల్ రిపేర్ బిజినెస్ చేస్తున్న అలీ డ్రగ్స్‌కు బానిసగా మారాడు. డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాడు. ఈ క్రమంలో నిన్న ఒక అపార్ట్‌మెంట్‌లో అలీ డ్రగ్స్ సేవించాడు. అయితే డ్రగ్స్ ఓవర్ డోస్‌గా తీసుకోవడంతో అలీ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసిన వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు అలీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వొచ్చింది?… ఎవరి దగ్గర తీసుకున్నాడు? అలీకి డ్రగ్స్‌ను ఎవరు విక్రయించారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



