– ఇటీవల దివంగతులైన మాధవరెడ్డి మాతృమూర్తి
– కాజీపేటలో మాతృయజ్ఞం నిర్వహించిన ఎమ్మెల్యే
కాజీపేట , ప్రజాతంత్ర, అక్టోబర్ 15: నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి మాతృయజ్ఞం కార్యక్ర మంలో బుధవారం ముఖ్యమంత్రి పాల్గొని ఆయన తల్లి కాంతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే దొంతిని పరామర్శించారు. మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల మరణించగా కాజీపేట ప్రశాంత్ నగర్ సమీపంలోని పిజిఆర్ గార్డెన్ లో మాతృ యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమం త్రితో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. మాధవ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా హనుమకొండ సుబేదారి లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెలిపాడ్ వద్ద దిగారు. అక్కడ మంత్రి అనసూయ సీతక్క, ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, యశస్విని రెడ్డి, కే ఆర్. నాగరాజు, గండ్ర సత్యనారాయణ, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





