– రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి దీపావళి శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: రెండేళ్ల ప్రజా పాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ వెలుగుల పండుగను రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. దీపాల కాంతులతో ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా చిన్నా పెద్ద అందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని, ప్రమాదాలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి శుభాకాంక్షలు
దీపాల కాంతులతో, సంస్కృతీ సంప్రదాయాలతో చేసుకునే పండుగ దీపావళి. అమావాస్య చీకట్లను పారదోలి పున్నమి వెలుగులను జీవితంలోకి ఆహ్వానించే పండుగ దీపావళి అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటాము. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య పద్దతిలో ఓడిరచి ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలే తీసుకువచ్చారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





