హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 25: హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఫొటోలతో నేరగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సప్‌లో సజ్జనార్ ఫొటో డీపీగా పెట్టుకొని సందేశాలు పంపుతున్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. ముఖం చూసి మోసపోవద్దంటూ జాగ్రత్తలు చెప్పారు. వాట్సప్‌లో డీపీగా నా ఫొటోపెట్టి, తెలిసిన వాళ్లకు సందేశాలు పంపుతున్నారు. ఇవి నకిలీ ఖాతాలు, పూర్తిగా మోసపూరితమైనవి. ఇలాంటి సందేశాలకు స్పందించవద్దు. ఆ నెంబర్లను బ్లాక్ చేసి రిపోర్టు చేయండి. సైబర్ నేరగాళ్లకు వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు. డబ్బులు అడిగితే పంపొద్దని సజ్జనార్ పేర్కొన్నారు. నకిలీ వాట్సప్ ఖాతాల గురించి 1930కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



