సత్యాన్ని సమాధి చేసే కుట్రలు

“కేంద్ర రాష్ట్రాలు పరోక్ష్యంగా ప్రత్యేక్షంగా నియంత్రించే, ప్రభుత్వాల ఆధ్వర్యంలో పని చేసే విచారణ సంస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. కాబట్టి ఈ కాల్చివేత కుట్రల్లో కేంద్ర, రాష్ట్రాల ప్రమేయం ఉందన్న ఆరోపణలుండంతో, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే సరిపోదు. అంతర్ రాష్ట్రాల, కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అనుమానాలున్నాయి కాబట్టి, అందులోనూ కేంద్రం, రాష్ట్రం రెండు కూడా  నిందితులు ఉన్నారు, నిందితులే విచారణకు ఆదేశించి, ఎంక్వైరీని పర్యవేక్షిస్తే నిజాలు ఎప్పటికీ బయటకు రావు..వాస్తవాలు సమాధి అవుతాయి. కాబట్టి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో, లేదా సిట్టింగ్ కోర్టు జడ్జి ప్రత్యేక్ష పర్యవేక్షణలో విచారణ జరపాలి. అప్పుడే నిజాలు వెలుగులోకి వస్తాయి.”
తెలంగాణలో రాజకీయాలు హీట్‌ పుట్టిస్తున్నాయి.చిలికాలం పోకముందే పొలిటికల్ హీట్‌తో వాతావరణం వేడేక్కింది. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో కనిపిస్తుంది. బలం పెంచుకునేందుకు ప్రతపక్ష బీఆర్ఎస్‌ కష్టపడుతుంటే. బలాన్ని నిలుపుకునేందుకు అధికార కాంగ్రెస్‌ గ్రౌండ్‌లో చెమటోడ్చుతుంది. సీఎం జిల్లాలో సభలు పెట్టుతుంటే, కేటీఆర్‌, హరీష్‌ రావు ప్రజలను కలుస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాల్లో అధికార విపక్షాలు పోటీపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తొలిసారి పార్టీ గుర్తులపై జరుగుతున్న లోకల్ ఎన్నికలు కావడంతో సత్తా చాటేందుకు రెండు పార్టీలు కష్టపడుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలు వన్‌ సైడ్‌ గా జరగడం లేదు. ఏ పార్టీకి కూడా ఏకపక్ష విజయాలు వస్తాయన్న వాతావరణం లేదు.నువ్వా నేనా అన్నట్లుంది. పోల్‌మేనేజ్‌ మెంట్ వంటి అందమైన వోట్ల కోనుగోలు చేసిన పరిస్థితి రెండు పార్టీలకు డూ ఆర్ డై అన్నట్లే ఉంది. బీజేపీ అయితే కరీనగర్‌, నిజామాబాద్‌ తప్ప ఎక్కడ పెద్దగా యాక్టీవ్‌గా కనిపించడం లేదు.
ప్రతిపక్షంపై అధికార పార్టీ సిట్‌ విచారణలు, కమిషన్ ఎంక్వైరీలు, ఏసీబీ కేసులంటూ వేధిస్తుంటే.మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు, హమీలపై రేవంత్‌ రెడ్డి సర్కార్‌ను ప్రజల్లో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఫోన్‌ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్‌ కేసు, కాళేశ్వరం కేసులంటూ విపక్షాలనే కాంగ్రెస్‌ రేవంత్‌ రెడ్డి వేధిస్తుంటే. ప్రతిపక్ష బీఆర్ఎస్‌ హాల్ట్ పాలసీ, పాలసీల ముసుగులతో సీఎం,మంత్రుల అవినీతిని నిలదీస్తుంది .ప్రభుత్వ కుంభకోణాలు, రేవంత్‌ రెడ్డి అనుచరుల దోపిడీని విపక్షం ప్రశ్నిస్తుంది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, చంద్రబాబుతో కలిసి రేవంత్‌ రెడ్డి తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని బీఆర్ఎస్‌ ఆరోపిస్తుంది . ప్రభుత్వ పెద్దలు సమైక్యవాదుల పంచన చేరి  తెలంగాణ అస్థిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కించపర్చేలా వ్యవహరిస్తుంటే తెలంగాణ ఆత్మగౌరవం, అస్థిత్వం కోసం బీఆర్ఎస్‌ నిలబడుతుంది. దిల్లీని నిధులు, ఏపీకి నీళ్లలను ధారాదత్తం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గులాబీ పార్టీ పోరాటం చేస్తుంది.ప్రజలను చైతన్యం చేస్తూ తెలంగాణను జాగురుతం చేస్తోంది.
అక్కడితోనే ఆగిపోలేదు.వేధింపులు, వెండేటా ఎజెండాగా మొదలైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రస్తావన, డ్యామ్‌లు పేల్చడం, కాల్వులు, చెక్ డ్యామ్‌ను కూల్చడం దాకా చేరింది.తాజా మున్సిపల్‌ ఎన్నికల వేళ ఏకంగా ఇప్పుడు పలు కీలక కేసుల్లో ముఖ్యమైన ఆధారాలు, నివేదికలు ఇచ్చే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదమనే ఘటన దాకా వచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యినప్పటి నుంచి కాంగ్రెస్‌ తీరు అనుమానాస్పదమే. రెండున్నరేళ్ల పాలన మొత్తం వివాదాస్పదమే.మేడిగడ్డ బ్లాస్ట్‌, డ్యామ్‌ల పేల్చివేత నుంచి ఇవాళ్టి ఫోరెన్సిక్‌ లో అగ్నిప్రమాదం వరకు  ప్రభుత్వంపై అన్ని అనుమానాలు, ఆరోపణలే. ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసిన బీఆర్ఎస్‌ బలంగా నిలబడటంతో రెండేళ్లు ప్రాజెక్ట్‌లు కూల్చుడు, డ్యామ్‌లు పేల్చడం కుట్రలు చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఏకంగా డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఇక సాధ్యం కాదని ఏకంగా కీలకమైన కేసుల ఆధారాలున్న ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కాల్చివేత  కాల్చడానికి కుట్రలు చేశారన్న ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి. నిజానికి  ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం పెద్ద ఇష్యు అయ్యేది. రాష్ట్ర రాజకీయాలను షేక్‌ చేసేది. కానీ మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాలు, ప్రజలు ప్రచారంలో బిజీగా ఉండటంతో పెద్దగా పట్టించుకోలేదు.
అయితే, అగ్ని ప్రమాదంగా చిత్రీకరిస్తున్న ఈ ఘటనలో అనేక అనుమావాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రమాదం జరిగిన తీరు, అధికారుల ప్రకటనలు, పోలీస్ కేసుపై అనేక సందేహాలు.ఒకే రోజే ప్రభుత్వం రెండు ప్రకటనలపై  సందేహాలు మరింత పెరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో వేళ ప్రమాదం, అంతకు ముందు ఫోన్ ట్యాపింగ్, రేవంత్ అండ్ కో అవినీతి ఆరోపణలు, ఇప్పుడు అగ్ని ప్రమాదం డైవర్షన్ పాలిటిక్స్. ఇలా ఒకదానికితో ఇకటి ఇంటర్‌ లింక్ ఉండటంతో అగ్ని ప్రమాదంపై ప్రజల్లో అనుమానాలు  బలపడుతున్నాయి. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పలు కీలక కేసులకు చెందిన ఎవిడెన్స్‌ ఉంటాయి..రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే, ప్రభుత్వాలను మార్చే కేసులు ఆధారాలు ఉంటాయి..అలాంటి ల్యాబ్‌లో ప్రమాదం జరగడం వెనుక ఏదో రాజకీయ కుట్రలున్నాయన్నది ప్రజల అనుమానం . ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదంలో దగ్ధమైన ఆధారాల్లో వోటుకు నోటు కేసు లో కీలక ఆధారాలు ఉన్నాయన్న అనుమానాలు పెరుగుతున్నాయి..అంతేకాదు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రెండు కేసులు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసేవి. వీటిలో నిందితులు ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ కీలక నేత ఉన్నారు.
వోటుకు నోటు కేసులో తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు  ఇద్దరూ నిందితులు. అటు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేతలు బీఎల్‌ సంతోష్‌ వంటి వారు నిందితులుగా ఉన్నారు.ఈ కేసులకు సంబంధించిన అన్ని ఆధారాలు  నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లోనే ఉన్నాయి.రెండు కీలక కేసులకు సంబంధించిన కీలకమైన ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ల్యాబ్ లో ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తుంది. పైగా చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామి. రేవంత్ రెడ్డి చంద్రబాబు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.బీజేపీ, చంద్రబాబు రేవంత్ కామన్ ఫ్రెండ్స్. కాబట్టి అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ద్వంద్వ ప్రయోజనాలు, పరస్పరం సహాకారం ఏమైనా ఉందా అన్నది తెలంగాణ ప్రజల డౌట్ మాత్రమే కాదు 150 కోట్ల దేశ ప్రజల సందేహాలు కూడా..వోటుకు నోటు, ఎమ్మెల్యేల కోనుగోలు కేసుల్లో ఉన్న నిందితులు దోషులుగా తేలితే ముగ్గురి భవిష్యత్తు ప్రశ్నార్థకమే అవుతుంది.దేశంలో బీజేపీ, తెలుగు రాష్ట్రాల్లో రేవంత్‌ ,చంద్రబాబుల పొలిటికల్‌ ఫ్యూచర్‌ అంధకారమైతుంది.
అందుకే పరస్పరం ప్రయోజనాలే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అగ్నిప్రమాదానికి  కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారశైలి దీనికి మరింత బలం చేకూర్చుతుంది. ఇటీవలే కాలంలో ఫోన్ కేసును అడ్డుపెట్టుకుని వోటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు గురు శిష్యుల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌ ఇల్లీగల్ అని చెప్పేందుకు చంద్రబాబు రేవంత్‌ తో పాటు ఆ జాతి మీడియా ప్రచారం చేస్తుంది.  .ఈ మేరకు తన బాకా మీడియా  బ్యాచ్ మోరల్ జడ్డిలా తీర్పులిస్తూ రాతలు రాస్తుంది..అంతేకాదు ఎమ్మెల్యేల కోనుగోలు నుంచి బీఎల్‌ సంతోష్‌ను తప్పించేందుకు రేవంత్‌ రెడ్డి విశ్వప్రయత్నాలు కేస్తున్నారు..అటు స్వయంగా వోటుకు నోటు నుంచి తాను బయటపడటమేకాదు గురువును కూడా బయటపడేసే ప్లాన్‌ చేస్తున్నారు.
వోటుకు నోటు కేసులో, ఎమ్మెల్యే కొనుగోలు కేసులో రేవంత్ రెడ్డి చంద్రబాబు బీజేపీ మెడకు ఉచ్చు బిగిస్తోంది. సుప్రీం కోర్ట్‌లో ట్రయల్స్‌ చివరి చేరింది..ఈ క్రమంలో నేరం రుజువైతే శిక్ష తప్పదు..అందుకే మొదట్లో అసలు ఫోన్‌ ట్యాపింగ్ ఇల్లీగల్‌ అని ప్రచారం చేసింది..తన బాకా మీడియాలో ప్రాపగండా చేసింది.అయితే అది విఫలం కావడంతో.ఈ నేపథ్యంలోనే ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం సంభవించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కేసుల నుంచి బయట పడేందుకు బీజేపీ రేవంత్‌ చంద్రబాబు పరస్పరం సహకారంలో భాగంగానే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కాల్చివేత అని అనుకుంటున్నారు ప్రజలు.విపక్షాల అనుమానం కూడా అదే.
ఇది తెలంగాణకు మాత్రమే పరిమితమైన కుట్రలు కాదు. కేంద్రం, రాష్ట్రాల ప్రత్యేక్ష పరోక్ష ఇన్వాల్వ్మెంట్ ఉందన్నది ఆరోపణలు. రాష్ట్ర పరిధిలో విచారణ సంస్థలు గానీ, కేంద్రం పరిధిలో ఉన్న సీబీఐ ఈడీ వంటి విచారణ జరపడం అంటే దొంగలకు తాళాలిచ్చినట్టే అవుతుంది. ఇప్పటికే ప్రజలు, కోర్టుల నమ్మకాన్ని విచారణ సంస్థలు కోల్పోయాయి. విచారణ సంస్థలన్నీ బీజేపీ అనుబంధ సంఘాలుగా, ఆయా సంస్థల చీఫ్ లు కాషాయ నేతలంటూ కాంగ్రెస్ సీనియర్‌ నేత రాహుల్ విమర్శిస్తున్నారు..సీబీఐ, ఈడీ,ఎన్ఐ, ఏసీబీ సిట్ విచారణతో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.
కేంద్ర రాష్ట్రాలు పరోక్ష్యంగా ప్రత్యేక్షంగా నియంత్రించే, ప్రభుత్వాల ఆధ్వర్యంలో పని చేసే విచారణ సంస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. కాబట్టి ఈ కాల్చివేత కుట్రల్లో కేంద్ర, రాష్ట్రాల ప్రమేయం ఉందన్న ఆరోపణలుండంతో, రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే సరిపోదు. అంతర్ రాష్ట్రాల, కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉందన్న అనుమానాలున్నాయి కాబట్టి, అందులోనూ కేంద్రం, రాష్ట్రం రెండు కూడా  నిందితులు ఉన్నారు, నిందితులే విచారణకు ఆదేశించి, ఎంక్వైరీని పర్యవేక్షిస్తే నిజాలు ఎప్పటికీ బయటకు రావు..వాస్తవాలు సమాధి అవుతాయి. కాబట్టి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో, లేదా సిట్టింగ్ కోర్టు జడ్జి ప్రత్యేక్ష పర్యవేక్షణలో విచారణ జరపాలి. అప్పుడే నిజాలు వెలుగులోకి వస్తాయి.
– తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *