జూబ్లీహిల్స్ ఎన్నికపై కాంగ్రెస్‌ ‌వ్యూహం

– డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌28:‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ప్రతి డివిజన్‌ ‌వారీగా మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికలో ప్రతి వోటు కీలకమని భావించిన సీఎం, బలమైన మంత్రులను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో రహమత్‌నగర్‌ ‌డివిజన్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను నియమించారు. బోరబండ డివిజన్‌ ‌బాధ్యతలు సీతక్క, మల్లు రవికి అప్పగించారు. వెంగళ‌రావునగర్‌ ‌డివిజన్‌లో తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సమన్వయం చేస్తారు.సోమాజిగూడ డివిజన్‌ ‌పర్యవేక్షణ బాధ్యతలు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ ‌వహించనున్నారు. షేక్‌పేట డివిజన్‌ ‌బాధ్యతలు కొండా సురేఖ, వివేక్‌ ‌తీసుకుంటారు. ఎర్రగడ్డ డివిజన్‌ను దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు చూసుకుంటారు. అలాగే యూసుఫ్‌గూడ డివిజన్‌ ‌పర్యవేక్షణ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నంలకు అప్పగించారు. ఉప ఎన్నికలో సమన్వయం, ప్రచార వ్యూహం, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రతి మంత్రి స్థాయిలో పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్‌ ‌ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *