‘స‌ర్’ కు సంబంధించిన పెండింగ్ ప‌నులు పూర్తి చేయాలి

-వోట‌ర్ జాబితా నాణ్య‌త‌ను మెరుగు ప‌ర‌చాలి
– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి

 రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి శనివారం తెలంగాణలోని అన్ని ఇఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వోటరు జాబితా ప్రత్యేక  సవరణ  కార్యక్రమం పురోగతి, అలాగే పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలను ఆయన సమీక్షించారు. వోటర్‌ జాబితా నవీకరణ, క్లెయిమ్‌లు–అభ్యంతరాల పరిష్కారం, ఫీల్డ్‌ ధృవీకరణ, డేటా ఎంట్రీ ఖచ్చితత్వం వంటి ముఖ్య అంశాలపై సీఈఓ అధికారులు నివేదికలు సమర్పించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కట్టుబడి అమలు చేయాలని, ప్రతి దశలోనూ ఖచ్చితత్వం, జాగ్రత్త, సమయపాలన పాటించాల్సిందే అని ఆయన సూచించారు. ‘స‌ర్’ కు సంబంధించిన పెండింగ్‌ పనులను వేగంగా పూర్తి చేసి, వోటర్‌ జాబితా నాణ్యతను మరింత మెరుగుపర్చే దిశగా శ్రద్ధగా పనిచేయాలని సీఈఓ ఆదేశించారు. ఖచ్చితమైన, లోపరహిత వోటర్‌ జాబితా ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఈఓ హరి సింగ్, ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *