పల్లె దవాఖాన తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌

– ఎంఎల్‌హెచ్‌పి డాక్టర్‌ మూల్యంక సత్కరించి
– ఏఎన్‌ఎమ్‌లు, ఆశ వర్కర్‌కు అభినందన

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో రికార్డులను పరిశీలించి రోజూ ఎంతమంది రోగులు వస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. మందులు అన్నీ అందుబాటులో ఉన్నాయా అని ప్రశ్నించారు. గత నెలలో ఈ దవాఖాన పరిధిలో ఎన్ని ప్రసవాలు జరిగాయి, అవి ఏ హాస్పిటల్స్‌లో అయ్యాయి, ఈ నెలలో ఎన్ని ఈడిడిలు ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు .
పల్లె దవాఖానను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించడం చేస్తున్న ఎంఎల్‌హెచ్‌పి డాక్టర్‌ ఆర్‌.మూల్యంకను శాలువాతో సత్కరించారు. ఏఎన్‌ఎమ్‌లు, ఆశ కార్యకర్తని కలెక్టర్‌ అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *