– ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమావేశం
వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 4: జిల్లాలో స్థానిక సం స్థల ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కలె క్టరేట్‌లోని సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్ కుమార్, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ శనివారం సమావేశం నిర్వహించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, శాంతిభద్రతలు (లా అండ్ ఆర్డర్), సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, చెక్‌పోస్టుల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, రూట్ మ్యాప్‌ల తయారీ, పార్టీల ప్రచారానికి అనుమతుల మం జూరు వంటి కీలక అంశాలపై అధికారులకు స్పష్టమైన సూచ నలు చేశారు. జిల్లాలో రెండు విడతలలో స్థానిక సంస్థల, రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరు గుతాయని, మొదటి విడతలో 5 మండలాలు, రెండో విడతలో 6 మండలాల్లో ఎన్నికలు జరుగుతా యని చెప్పారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందు కు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమ లు చేయాలని, జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పా టు చేయాలని, సమస్యాత్మక, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి లైవ్ వెబ్ కాస్టింగ్, ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్దం చేశామని, ఎన్నికల సిబ్బందితోపాటు అదనంగా సిబ్బందిని నియమించి విధులపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, బెదిరింపులు, అక్రమ ప్రచారాలు వంటి ఉల్లంఘనలపై నిఘా పెట్టి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల కేంద్రాల్లో నామినేషన్ స్వీకరణ కోసం అవసం మైన ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్ల స్క్రూటినీ, ఉప సంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధన ల, విధులపై అధికారులు సమగ్ర అవగాహన కలిగి ఉం డాలన్నారు.అభ్యర్థులు ఫైనల్ అయ్యాక పొరపాట్లు జం గకుండా బ్యాలెట్ పేపర్ల ముద్రణ జరగాలని, ఎన్నికల కు అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధం చేసు కోవాలని చెప్పారు. ప్రతి ఓటరూ భద్రతతో కూడిన వాతా వరణంలో ఓటు వేసే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో రామిరెడ్డి, డీపీవో కల్పన, ఆర్డీవోలు సత్యపాల్‌రెడ్డి, ఉమా రాణి, జిల్లా నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


