ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు
భారత్ నుంచి ఎంపికైన ఏకైక అధికారిగా గుర్తింపు
వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు తెలంగాణ ట్రాన్స్ కో సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపికయ్యారు. స్టాటిస్టిక్స్, అనలిటిక్స్ సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సు నిర్వహిస్తుంది. మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) కోర్సు లో మాస్టర్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ లో చదువుకుని అందులో చేసిన ప్రాజెక్టు వర్క్ ప్రధాన ఆధారంగా ఈ ఫెలోషిప్ కు ఎంపిక చేశారు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఫెలోషిప్ కోసం 2,600 పైచిలుకు దరఖాస్తులు వొచ్చాయి. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 33 మంది ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను ఎంపిక చేశారు. కాగా భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక అధికారి కృష్ణ భాస్కర్ కావడం గమనార్హం. ఫెలోషిప్ లో భాగంగా వాషింగ్టన్ లో తొమ్మిది రోజుల పాటు నేరుగా ట్రైనింగ్ పొందేందుకు రావాలంటూ వరల్డ్ బ్యాంక్ అధికారులు కృష్ణ భాస్కర్ కు ఆహ్వానం పంపారు. ఆరు నెలల కోర్సులో భాగంగా ప్రత్యేక శిక్షణ తదుపరి డిజిటల్ అనుబంధంగా ఈ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫెలోషిప్ కు ఎంపికైన కృష్ణ భాస్కర్ అమెరికా వెళ్లడానికి ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోర్సుకు సంబంధించిన మొత్తం వ్యయాన్ని వరల్డ్ బ్యాంక్ భరిస్తుంది. స్టాటిస్టిక్స్ -అనలిటిక్స్ సంబంధించి అనుబంధాన్ని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ప్రభుత్వ అధికారులను ప్రోత్సహించాలనేది వరల్డ్ బ్యాంక్ ఆలోచన. ఈనెల 18 నుంచి 27 వరకు అమెరికాలో ప్రత్యక్ష కోర్సు జరగనుంది.
కృష్ణ భాస్కర్ కు ఉప ముఖ్యమంత్రి అభినందనలు
ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు ఎంపికైన తన స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్ ను గురువారం అసెంబ్లీ ఆవరణలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు. భారతదేశ వ్యాప్తంగా ఒకే ఒకరు ఎంపిక కావడం అది మన రాష్ట్రానికి చెందిన ట్రాన్స్ కో సీఎండి కావడంపై హర్షం వ్యక్తం చేశారు.