హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి విజయం సొంతం చేసుకున్న భారత మహిళా జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మన మహిళల జట్టు కొత్త అధ్యాయం నమోదు చేసిందని ప్రశంసించారు. జట్టు ఆట తీరు, ఈ విజయం అందరికీ స్పూర్తిదాయకంగా నిలిచాయన్నారు.
మంత్రి సీతక్క అభినందనలు
మహిళల ప్రపంచ క్రికెట్ టీమ్ కప్ గెలుచుకొని భారత దేశానికి అపూర్వమైన గౌరవాన్ని తెచ్చిందని మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అభినందనలు తెలిపారు. ఈ జట్టు గెలుపు దేశానికే గర్వకారణమన్నారు. క్రీడల ప్రపంచంలోమన మహిళా టీం ప్రతిభా ప్రదర్శనతో కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. ప్రతి పౌరుడికీ ఇది స్ఫూర్తిదాయక ఘట్టం అని పేర్కొన్నారు. ఈ విజయంతో భారత మహిళల సత్తా ప్రపంచం ముందు మరోసారి రుజువైందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ప్రపంచస్థాయి విజయం సాధించిన ఆటగాళ్లకు మంత్రి సీతక్క ప్రత్యేక అభినందనలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





