బ్రహ్మోస్‌ విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకోవాలి

ఆ సంస్థ ప్రతినిధి బృందానికి సీఎం సూచన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18: దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమని, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ విస్తరణకు తెలంగాణను అందునా హైదరాబాద్‌ను ఎంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రతినిధి బృందం బుధవారం ఆయనను కలుసుకుంది. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ఎండీ అండ్‌ సీఈవో డాక్టర్‌ జైతీర్థ్‌ ఆర్‌.జోషి, బ్రహ్మోస్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సూరంపూడి సాంబశివప్రసాద్‌, డైడీెఆర్‌డీఎల్‌ డైరెక్టర్‌ జి.ఎ.శ్రీనివాసమూర్తి, తదితరులు ఉన్నారు. హైదరాబాద్‌ Iబెంగుళూరు డిఫెన్స్‌ కారిడార్‌ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైనదని వివరించిన సీఎం ఇప్పటికే హైదరాబాద్‌లో డిఫెన్స్‌కు సంబంధించి వివిధ సంస్థలు ఉన్నాయని తెలిపారు. కాగా, సీఎం విజ్ఞప్తి బ్రహ్మోస్‌ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *