– త్వరలోనే ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేస్తాం
– నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: మెగాస్టార్ చిరంజీవి ఫిర్యాదు చేసిన డీప్‌ఫేక్ కేసులో విచారణ చేస్తున్నట్లు నగర సీపీ సజ్జనార్ తెలిపారు. చిరంజీవి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై ఆయన విూడియాతో మాట్లాడుతూ డీప్‌ఫేక్ మూలాల్లోకి వెళ్లి నిందితులను అరెస్టు చేస్తామని చెప్పారు. ఇలాంటి డీపీఫేక్ సెలబ్రిటీల కేసులు పెరిగే అవకాశం ఉందని, దీనిపై త్వరలోనే ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామని వెల్లడిరచారు. చాదర్‌ఘాట్ కాల్పుల కేసులో కూడా పురోగతి ఉందని స్పష్టం చేశారు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని సీపీ స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలుగా మార్చి వెబ్‌సైట్లు, సోషల్ విూడియాలో దుండగులు పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. దీనిపై ఆయన వెంటనే సీపీ వీసీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం కోర్టను సైతం ఆశ్రయించటంతో న్యాయస్థానం ఆదేశాలతో సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన పేరును దెబ్బతీసేలా డీప్‌ఫేక్ వీడియోలు రూపొందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను చిరంజీవి కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





