ఇరాన్ కీలక ప్రకటన
ఆ క్రెడిట్ తనదేనని ప్రకటించుకున్న ట్రంప్
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పేర్కొన్నారు. గ్రినిజ్ సమయం ప్రకారం ఉదయం 4 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందంటూ ఆ క్రెడిట్ తనదేనని ప్రకటించుకున్నారు. ఆ వెంటనే అలాంటిదేమీ లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తరువాత గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌లోని బీర్షేవా నగరంపై మిసైల్ దాడులకు దిగింది. ఈ మిసైల్ దాడిలో ముగ్గురు ఇజ్రాయెల్ వాసులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఏమైనట్టు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇంతలోనే యుద్ధం ముగింపు(జవaంవటఱతీవ)పై ఇరాన్ మరో కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్టు ఆ ప్రభుత్వ మీడియా వెల్లడిరచింది. విరమణ ఒప్పందం కుదరకమునుపే మిసైల్స్ దాడి జరిగిందని తాజా దాడిపై స్పష్టత ఇచ్చింది. ఈమేరకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఓ కీలక ప్రకటన చేశారు. ‘ఇజ్రాయెల్‌ను శిక్షించేందుకు మా మిసైల్ దాడులు ఉదయం 4 గంటల వరకూ కొనసాగాయి. మా సాయుధ దళాలకు ప్రజలందరితో కలిసి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఇరాన్ రక్షణ కోసం చివరి రక్తపు బొట్టును కూడా త్యాగం చేసేందుకు సాయుధ దళాలు సిద్ధమయ్యాయి. చివరి నిమిషం వరకూ శత్రువుపై దాడులు చేశారు’ అని యుద్ధం ముగింపు గురించి పరోక్ష ప్రకటన చేశారు. కాగా, ఇప్పటినుంచి దాదాపు ఆరు గంటల తర్వాత ఇరాన్Iఇజ్రాయెల్ పరస్పరం తుదివిడత దాడులు పూర్తిచేసుకుని కాల్పుల విరమణ ఒప్పందానికి వస్తాయి. తొలుత అర్ధరాత్రి 12 గంటలు దాటాక (అమెరికా కాలమానం ప్రకారం) ఇరాన్ కాల్పుల విరమణను మెదలుపెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి ఇజ్రాయెల్ కాల్పుల విరమణను మెదలుపెడుతుంది.. దీంతో 12 గంటలు ముగిసిన తర్వాత 12 రోజుల యుద్ధానికి అధికారిక ముగింపు లభిస్తుంది. ఈ ఒప్పందం అమలులో ఉన్నపుడు పరస్పరం శాంతియుతంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలి‘ అని ట్రంప్ సూచించారు. ఇరాన్ మొదట కాల్పుల విరమణను ప్రకటించగా ఇక్కడినుంచి 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే ఇజ్రాయెల్‌నుంచి ఎలాంటి స్పందనా లేదు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే