అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన

వరంగల్,ప్రజాతంత్ర,మార్చి18:అన్నదాతలను ప్రకృతి పగబట్టింది. వాతావరణంలో ఏర్పడిన మార్పులు రైతులను కలవరపెడుతున్నాయి. చేతికందిన పంట వర్షార్పణం అయిపోతుండటంతో రైతులు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు. మిర్చి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అసలే ఈ ఏడాది మిర్చికి సరైన ధర లేక తలలు పట్టుకుంటున్న రైతులకు ఇప్పుడు వాతావరణ ప్రతికూల పరిస్థితులు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి.…






