Category తెలంగాణార్థం

‘మార్వాడీ గోబ్యాక్’ జాతి సమస్య కాదు, దోపిడీ సమస్య!

“మొత్తం మీద ఈ గందరగోళపు సమస్య చిలికి చిలికి గాలివాన అవుతున్నది. ఎప్పుడైనా ఒక పరిణామం ఒక దశకు వచ్చినప్పుడు అదేదో హఠాత్తుగా జరిగిందని చాలామంది భావిస్తారు. కాని, ప్రకృతిలో, సమాజంలో ఇటువంటి దశలు హఠాత్తుగా ఏమీ రావు. ఎంతోకాలంగా ఆ పరిణామం నిశ్శబ్దంగా, పైకి కనబడకుండా జరుగుతూ జరుగుతూ ఏదో ఒక ఘటన దగ్గర…

అందరూ బీసీలకు మద్దతే, కాని ఒరిగిందేమీ లేదు!

BC quota is the buzzword in Telangana politics today.

“వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి ప్రాతిపదిక ఏమిటనే విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉండగా, షెడ్యూల్డ్ కులాల, తెగల జన సంఖ్య విషయంలో కచ్చితమైన జనగణన అంకెలు ఉన్నట్టుగా, ఇతర కులాల విషయంలో అంకెలు అందుబాటులో లేవు. అందువల్ల వెనుకబడిన కులాలకు కచ్చితమైన రిజర్వేషన్ కోటా నిర్ధారించడం జరగలేదు. అసలు వెనుకబడిన కులాలు (కాస్ట్స్) అని కూడా అనకుండా వెనుకబడిన తరగతులు/వర్గాలు…

పిడికెడు నిజాలూ, బండెడు రాజకీయాలూ!

“ఇప్పటికి ఇంకా జస్టిస్ పి సి ఘోష్ ఏమి రాశారో, ఆ 650 పేజీల తిలకాష్ఠమహిషబంధనం బైటపడలేదు గనుక ఆ నివేదిక మీద వ్యాఖ్యానించడం న్యాయం కాదు. ఆ నివేదికను అధ్యయనం చేసి సారాంశం వివరించమని ప్రభుత్వం ముగ్గురు అధికారుల బృందాన్ని నియమించగా, ఆ బృందం రెండంటే రెండు రోజుల్లో ఆ 650 పేజీలు చదివి,…

పులుల ఆవాసం కోసం ఆదివాసుల నిర్వాసం!

“ప్రభుత్వ గణాంకాల ప్రకారం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 434 గ్రామాలుండగా అందులో 339 గ్రామాలు, అంటే 80 శాతం పులుల రిజర్వ్ లోకి వస్తాయంటే ఆ ఆదివాసీ జిల్లా స్వభావమే మారిపోతుందన్నమాట. అది ఆదివాసుల జిల్లా స్థానం నుంచి పులుల జిల్లా స్థానానికి మారుతుందన్నమాట. అలా జిల్లాను పులులకు వదిలేసినతర్వాత ఆదివాసులకు ఏమవుతుంది…

గిరాయిపల్లి బూటకపు ఎన్ కౌంటర్ కు యాభై ఏళ్లు!

Giraipalli fake encounter, Giraipalli encounter anniversary, 1975 Giraipalli incident, fake encounters in India, Telangana police encounters, human rights violations India, encounter case history, Giraipalli justice movement

“దేశంలో, ఆంధ్రప్రదేశ్ లో 1969-70 నుంచీ పోలీసులు ప్రకటించిన అసంఖ్యాక ఎన్ కౌంటర్లలో వేలాది మంది విప్లవకారులు, సాధారణ ప్రజలు చనిపోయారు. కాని ప్రత్యేకంగా గిరాయిపల్లి ఎన్ కౌంటర్ గురించీ, ఆ నలుగురి గురించీ యాబై ఏళ్లు నిండాయనే సందర్భం వల్ల మాత్రమే కాదు, ఇతర ప్రత్యేకతల వల్ల కూడా జ్ఞాపకం చేసుకోవాలి.” సరిగ్గా యాభై…

భజన సంస్కృతీ, విభజన సంస్కృతీ, సమాజ దుస్థితీ!

“సామాజిక శాస్త్రంలో కులం గురించి వివరణలో పుట్టుక, వంశపారంపర్యవృత్తి వంటి లక్షణాలతో పాటు ఇతర కుల సమూహాలతో కంచం పొత్తు, మంచం పొత్తు లేకపోవడం అనే వివరణ కూడా ఉంది. సహపంక్తి భోజన సంబంధాలు, వైవాహిక సంబంధాలు అనే భావనలను కంచం, మంచం అని సరళం చేసి (బహుశా చౌకబారుగా మార్చి) రాసినవాళ్లున్నారు. సామాజిక, సామూహిక…

ఎందరెందరి చేతుల మీద సిగాచి కార్మికుల నెత్తురు?

కాని ఆ నిర్లిప్తతను వదిలి, లోతుగా ఆలోచిస్తే సిగాచీ దురంతాన్ని వాస్తవంగా మారణకాండ అనాలి. యాజమాన్యం, ప్రభుత్వ సంస్థలు ఎన్నో ఏళ్లుగా పరిశ్రమ నిర్వహణలో చూపిన బాధ్యతా రాహిత్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది. ఇవాళ జరిగిన మరణాల స్థాయి అనూహ్యమైనది కావచ్చు గాని, ఏదో ఒక స్థాయి దుర్ఘటన జరగడానికి అన్ని ఏర్పాట్లూ ఎప్పటి…

తెలంగాణ ఎట్లుండాల్నో చెప్పడానికి అమిత్ షా ఎవరు?!

డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికీ, పసుపు బోర్డ్ ప్రకటించడానికీ ఆదివారం నాడు నిజామాబాద్ వచ్చిన   కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో నక్సలైట్ల గురించీ, తెలంగాణ గురించీ అనుచిత ప్రస్తావనలు చేశాడు. తెలంగాణ ప్రభుత్వానికీ, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి పేరు చెప్పి మరీ ముఖ్యమంత్రికీ, హెచ్చరికలు చేశాడు. అటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ…

కాళరాత్రి నిజంగా అంతమయిందా?!

తన ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తారుమారు చేయడానికి ప్రధాని ఇందిరా గాంధీ సలహాతో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీ విధించి, ప్రాథమిక హక్కులు రద్దు చేసి, పత్రికల మీద సెన్సార్ షిప్ విధించి, దేశాన్ని చీకటిరాజ్యంగా మార్చిన పరిణామానికి ఈ జూన్ 25 అర్ధరాత్రికి యాబై ఏళ్లు నిండాయి.…