Category తెలంగాణార్థం

ప్రతి ప్రమాదమూ పథకం ఫలితమే!

“నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రవాణా రంగం మీద దాదాపు గుత్తాధిపత్యం నెరపుతున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లది మొదటి నుంచి చివరి దాకా మోసాలమయమైన వ్యాపారం. అటువంటి అక్రమ వ్యాపారంలో ప్రమాదం అనేది యాదృచ్ఛికం కాదు, అది ఒక పథక రచన ప్రకారం జరిగిన అనేక పరిణామాల పర్యవసానం. ఆ అక్రమ వ్యాపారాన్ని ప్రభుత్వ నియంత్రణా…

అందరూ బీసీల మేలు కోరేవారే, వాటా మాత్రం…

“ఒక ప్రభుత్వ విధానం వల్ల బాధితులు, లేదా ఒక సామాజిక పరిణామం మీద నిరసన తెలియజేయదలచుకున్న ప్రజా సమూహాలు, లేదా ఆ బాధితుల తరఫున, సమూహాల తరఫున ప్రతిపక్షాలు బంద్ పిలుపు ఇస్తాయి. ప్రతిపక్షాలు ఇచ్చే బంద్ పిలుపును విఫలం చేయడానికి ప్రభుత్వాలు పోలీసులను రంగంలోకి దింపుతాయి. నిరసనకారులను అరెస్టు చేయడం, నిరసనకారుల మీద లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం, రబ్బరు బులెట్ల కాల్పులు, నిజమైన…

ఎవరూ చెరిపెయ్యలేని సామూహిక జ్ఞాపకం

“తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాధించిన విజయాలుగా ప్రచారం చేసినవన్నీ అబద్ధాలని ఆ అబద్ధాల పుస్తకం రాసింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట క్రమంలో పది లక్షల ఎకరాల భూమిని భూస్వాముల చెర నుంచి విడిపించి భూమిలేని పేదలకు, కౌలుదార్లకు, పేద రైతులకు పంపిణీ చేయడం జరిగిందనే వాస్తవాన్ని శత్రువులు కూడా ఎన్నడూ ఖండించలేదు గాని ఆ పోరాటానికి…

మూసీ వరద – ఎవరి కన్నీరు? ఎవరికి పన్నీరు?

“ఎగువన భారీ వర్షాలు కురిసినప్పటికీ అటువంటి రెండు పెద్ద జలాశయాలు, ఆనకట్టలు ఉన్న తర్వాత 1908 లాంటి వరదలు రావడానికి అవకాశం లేదు. కాని 2025 వరదలు ఎట్లా వచ్చాయి? పోనీ, ఎగువన భారీ వర్షాలు కురిశాయా అని చూస్తే అది కూడా జరగలేదని వాతావరణ నివేదికలు చెపుతున్నాయి. అధికారులే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుంచి భారీగా నీటిని…

రసవత్తర స్థానిక సంస్థల ఎన్నికల ప్రహసనం!

“ఎన్నికల ఫలితాల మీద ప్రతి ఒక్కరికీ భయమూ అనుమానమూ ఉన్నాయి గాని ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా నిజంగా ఎన్నికలకు వెళ్లాలని లేదు. అటువంటి వైఖరి అధికారపక్షానికి మరింత ఎక్కువగా ఉంది. ఎన్నికలను జరపక పోవడం ద్వారా గ్రామాల మీద ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు కాక ప్రభుత్వాధికారులకే అధికారం వస్తుంది. అంటే ప్రభుత్వానికి నిధుల…

వెంటిలేటర్ మీద తెలంగాణ ఆర్థిక వ్యవస్థ!  

Telangana Economy on a Ventilator Rising Debt and Fiscal Challenges Exposed

“విద్యార్థుల ఫీజుల రియింబర్స్ మెంట్ కింద ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు ఆరు సంవత్సరాలుగా పేరుకు పోయాయనీ, అవి ఎనిమిది వేల కోట్ల రూపాయల పైనే ఉంటాయనీ తెలుస్తున్నది. అలాగే విభిన్న వర్గాల పేద, మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తించే ఆరోగ్యసేవల పథకం ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు హాస్పిటల్స్ కు  ప్రభుత్వం చెల్లించవలసిన…

తెలంగాణ కుల హత్యల భూమిగా మారుతున్నదా?

“వీరిలో ఒక్కొక్కరిదీ ఒక విషాద గాథ. కొన్ని గాథలు మిగిలినవాటికన్నా ఎక్కువ ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చు. అసలు నమోదే కాని, వార్తలకెక్కని ఘటనలు మరెన్ని ఉన్నాయో తెలియదు. కాని ఇంకా ఇరవైల్లో ప్రవేశించని, లేదా ఇరవైల తొలిరోజుల్లోని ఈ యువతీ యువకులు ఒక్కొక్కరూ తమ హృదయం చెప్పిన మాట విన్నారు. సామాజిక కట్టుబాట్లను లెక్కచేయగూడదనుకున్నారు. కుల…

బహుముఖాలుగా సాగవలసిన మరో గ్రంథాలయోద్యమం!

మరో గ్రంథాలయోద్యమం నిజంగా విజయం సాధించాలంటే అది కనీసం మూడు స్థాయిలలో విస్తరించాలి. మొదట వ్యక్తుల, కుటుంబాల, స్నేహ బృందాల స్థాయిలో పుస్తక పఠనం పెరగాలి, ప్రతి ఒక్కరూ తన వంతుగా తాను ప్రతి రోజూ ప్రతి వారమూ ఏమి చదువున్నానో ఆలోచించుకోవాలి. అందువల్ల గ్రంథాలయ అవసరం గురించి అవగాహన పెరుగుతుంది. అప్పుడు గ్రంథాలయాల ఏర్పాటు…

యూరియా కూడా రాజకీయ వస్తువే!

“అలా యూరియా మితిమీరిన వినియోగం అనే ఒక కారణం ఉండగా, దాన్ని సవరించవలసిన, రైతాంగానికి నచ్చజెప్పి యూరియా వాడకం తగ్గించవలసిన వ్యవసాయ శాఖ ఆ పని చేయకపోవడం వల్ల యూరియా అవసరం పెరిగిపోతూనే ఉంది. ఈ స్థితిలో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, వరి సాగు విస్తీర్ణం ఈ సంవత్సరం ఖరీఫ్ లో హఠాత్తుగా…