Category తెలంగాణ

రుద్రారంలో అంగరంగ వైభవంగా బోనాల పండగ

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:రుద్రారం గ్రామంలో శ్రావణమాసంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడంతో ఎంతో ఆనందోత్సవం అమ్మవారి కృప నియోజకవర్గ ప్రజలపై ఉంటుందని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామంలో శ్రావణమాసంలో నిర్వహించే పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమానికి  నీలం మధు హాజరై ప్రత్యేక…

ఈనెల 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు విజయవంతం చేయాలి

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 11 :ఈనెల 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే విజయభేరి సభను కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు, అభిమానులు పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కందుకూరు మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహ చారి పిలుపునిచ్చారు.సోమవారం ఆయన విజయభేరి సభ ప్రాంగణం రాష్ట్ర నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయభేరి సభకు సోనియా…

సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురికి ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు ఈమేరకు ఆయన సోమవారం నియోజకవర్గ పరిధిలోని పలువురికి వైద్య చికిత్స నిమిత్తం   సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.11,62,000/- పదకొండు లక్షల అరవై…

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయాలి

వికారబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: ఈనెల 16న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నందున, జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతులను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ముందుగా…

గర్భిణీలకు చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ మాసం సందర్భంగా ప్రతి గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవాలని, బరువు తక్కువ ఉన్న పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో పోషకాహారము  అందించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత శాఖ అధికారులకు  ఆదేశించారు.సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్…

మహాత్మ జ్యోతిబాపూలే జాతీయ అవార్డుకు ఎంపికైన బీసీ ఉద్యమ నేత రాజ్ కుమార్

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: మహాత్మ జ్యోతిబా పూలే జాతీయ అవార్డు-2023 సంవత్సరమునకు గాను తాండూరు పట్టణానికి చెందిన  జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ వారు ప్రకటించారు. ఈ అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ నల్ల రాధాకృష్ణ…

రానున్న ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో ప్రజలు బీజేపీ పార్టీని కోరుకుంటున్నారని కచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇన్ చార్జి బి. జనార్థన్ రెడ్డి అన్నారు. సోమవారం అనంతపద్మనాభ స్వామిని స్థానిక నాయకులతో కలిసి  దర్శించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ. రాష్ట్రంలో బీఆర్ఎస్ , ఎంఐఎం…

రుణమాఫీ జమ అయిన రైతులకు కొత్త పంట రుణాలు

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: జగదేవపూర్ మండల వ్యాప్తంగా తేది.11-12-2023  నాటికి బ్యాంకులో పంట రుణం తీసుకొని చెల్లించని రైతులకు రుణమాఫీ డబ్బులు జమవుతున్నాయని ఇప్పటివరకు మండలంలో 2826 మంది రైతులకు రూ. 13 కోట్లు రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయని మండల వ్యవసాయ అధికారి యు వసంతరావు తెలియజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇంకా…

పోస్టల్ శాఖలో ప్రమాద బీమా ప్రజలకు దీమా

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: అతి తక్కువ ప్రీమియంతో 10 లక్షల ప్రమాద బీమా పాలసీని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బాలేశ్వర గుప్తా అన్నారు. సోమవారం యాలాల మండల కేంద్రంలో పోస్టల్ శాఖ ఏర్పాటు చేసిన ప్రమాద బీమా పాలసీ, బీమా పాలసీలపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోస్ట్ ఆఫీస్ లోను…