Category తెలంగాణ

యాదగిరిగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు

– గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 19 :యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని భక్తులు వేకువ జామునే గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కవచమూర్తుల అష్టోత్తర శతకటాభిషేకం పూజలు నిర్వహించారు.…

ఉప్పల్‌-నారపల్లి కారిడార్‌ వచ్చే దసరాకు పూర్తి

– ఆ మార్గంలో ఇప్పటికే బీటీ రోడ్డు పనులు మొదలయ్యాయి – మేడారం జాతర నాటికి నాణ్యమైన బీటీ రోడ్డు పూర్తి చేస్తాం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు సంబంధించి ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి…

ఈ నెల 22న జాబ్‌ మేళా

– బీటెక్‌, డిప్లమా మెకానికల్‌ & డీజిల్‌ మెకానికల్‌ ఐటిఐతో భర్తీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో మిత్రా ఏరిన ఆటోమొబైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్న…

మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే నవీన్‌ కృతజ్ఞతలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: జూబ్లీహిల్స్‌ నియోజవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ విజయసాధనకు విశేష కృషి చేసిన రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ రాష్ట్ర సచివాలయంలో బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. రహ్మత్‌ నగర్‌, బోరబండ డివిజన్‌లకు…

వయోవృద్ధులను వేధిస్తే కఠిన చర్యలు

– హన్మకొండ డిస్ట్రిక్ట్‌ జడ్జి డాక్టర్‌ పట్టాభి రామారావు హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ట్రిబ్యునల్‌ బెంచ్‌ సీనియర్‌ సిటిజన్స్‌కు వరం అని, వారికి ఏ సమస్య వచ్చినా ట్రిబ్యునల్‌ బెంచ్‌కు ఫిర్యాదు చేయవచ్చని హన్మకొండ జిల్లా జడ్జి డాక్టర్‌ కె.పట్టాభిరామా రావు తెలిపారు, డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీ హన్మకొండ ఆధ్వర్యంలో డాక్టర్‌ అనితా…

మెరుగైన మ‌హిళా సాధికార‌తపై చ‌ర్చించాలి

– ఉమెన్‌ రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబరు 19: మహిళలకు ఉపాధి అవకాశాలు, వివక్షను రూపుమాపడం, లింగ సమానత్వం సాధించడం, మహిళల భద్రత, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలపై నిపుణుల, మేధావుల, అధికారుల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనున్నదని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…

పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ఇందిర

– ఇందిరాగాంధీకి మంత్రి సీతక్క నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: భూ పంపిణీ కోసం, పేదరిక నిర్మూలనకు, అణగారినవర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ధీశాలి ఇందిరాగాంధీ అని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కొనియాడారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించి…

ఉద్యోగులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

– సచివాలయంలో హెల్త్‌ క్యాంప్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: మారుతున్న జీవన శైలిలో భాగంగా ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికీ ఉందన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలోని ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం రెనోవా హాస్పిటల్స్‌ అద్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐ బేస్డ్‌…

ఇందిరాగాంధీ సేవా భావం చిరస్మరణీయం

– ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ల నివాళులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: దివంగత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య, తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌ హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా…