Category తెలంగాణ

శరవేగంగా హైదరాబాద్‌ అభివృద్ది

రాష్ట్రంలో భేషుగ్గా శాంతిభద్రతలు కుట్రలు చేసేవారిని దూరం పెట్టాలి అభివృద్ధి చేస్తున్న కెసిఆర్‌నే ఆశీర్వదించాలి విఎస్‌టి స్టీల్‌ ‌బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నాయకత్వంలో హైదరాబాద్‌ ‌వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్‌ఫ్యూలు…

ఎస్సీ సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి

2023-24 బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.17,700 కోట్లు ఎస్సీల అభివృద్ధి కోసం ఎన్నో వినూత్నపథకాలు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ‌రూ.6684.3 కోట్లతో ఎస్సీ రెసిడెన్సియల్‌ ‌పాఠశాలలు నిర్వహణ సోషల్‌ ‌వెల్ఫేర్‌ ఇనిస్టిట్యూషన్‌ ‌సొసైటిలో 3836 అధ్యాపకుల పోస్టుల భర్తీ హైదరాబాద్‌, ఆగస్ట్ 19 : ఎస్సీ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు…

జంగారెడ్డిపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : కల్వకుర్తి నియోజకవర్గం లోని అమనగల్లు మున్సిపాలిటీ జంగారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు  సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతథిగా పాల్గొన్నారు .దుడ్డు కృష్ణ, ఉప్పుల రవి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ…

విగ్రహాల పేరుతో బీసీలను విచిన్నం చేసే కుట్ర

తాండూర్, ప్రజాతంత్ర, ఆగస్టు 19: ఎన్నికలవేళ బహుజలను విగ్రహాల పేరుతో విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుందని బిఎస్పి తాండూరు అసెంబ్లీ ఇన్చార్జి దొరిశెట్టి సత్యమూర్తి అన్నారు. శనివారం బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి గౌడ్ పాపన్న విగ్రహాన్ని తాండూర్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమని కానీ గత సంవత్సరం…

సిసి రోడ్డు పనులను నాణ్యతగా చేపట్టాలి ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : మున్సిపాలిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు నాణ్యతగా చేపట్టాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ అన్నారు. శనివారం 5వ వార్డ్ లో సిసి రోడ్డు పనులను చైర్మన్ రాంపాల్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు…

బహుజనుల అభ్యున్నతి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణలోమంత్రి శ్రీనివాస్ గౌడ్

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 19: బహుజనుల అభ్యున్నతి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్వాయి పాపన్న అని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా యువజన శాఖల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి…

కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు,పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు.శనివారం పరిగి పట్టణంలో పరిగి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….  కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల గురించి బూతుల వారిగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు…

పద్మశాలి నూతన కార్యవర్గ సభ్యుడిగా ఎర్రగుంట వేణుగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నిక

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 19:  జగదేవపూర్ కేంద్రంలోని మార్కండేయ ఫంక్షన్ హల్ లో పద్మశాలి నూతన కార్యవర్గ సంఘం కార్యవర్గం సమావేశం నిర్వహించారు. పద్మశాలి నూతన మండల సభ్యునిగా ఎర్రగుంట వేణుగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉప అధ్యక్షుడుగా మహేశుని యాదగిరి ఎన్నికైన్నారు. కార్యదర్శి దండే యాదగిరి, కోశాధికారి దండే వేణు, సహాయ కార్యదర్శి మంత్రి…

అభివృద్ధిలో మీర్ పేట్ ఆదర్శం మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 19: సీఎం కేసీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ లో రూ.66 లక్షల వ్యయంతో నిర్మించనున్న…