Category ప్రత్యేక వ్యాసాలు

బూమ‌రాంగ్ కానున్న ట్రంప్ టారిఫ్‌లు!!

Trump’s Tariffs Set to Backfire: Economic Risks Loom Large

నిజం చెప్పాలంటే ట్రంప్ అనుస‌రిస్తున్న విధానాల వ‌ల్ల యు.ఎస్‌. ప్ర‌భుత్వానికి ఆదాయం బాగా పెరిగింద‌నే చెప్పాలి. ఉదాహ‌ర‌ణ‌కు ఒక్క జూలై మాసంలోనే 152 బిలియ‌న్ డాల‌ర్ల క‌స్ట‌మ్స్ ఆదాయం ల‌భించింది. అయితే ట్రంప్ అనుస‌రిస్తున్న ఈ విధానంవ‌ల్ల ప్ర‌తికూల ఫ‌లితాలు కూడా వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఈ పెంచిన టారిఫ్‌ల వ‌ల్ల తాము అధిక‌మొత్తంలో ఖ‌ర్చు చేయాల్సి…

భారతీయ సంజ్ఞ భాషకు అధికారిక హోదా అవసరమే: కరీంనగర్ జిల్లా నుంచి దేశానికి ఆదర్శం

భాష అనేది మన భావాలను, అవసరాలను, మనకున్న వ్యక్తిత్వాన్ని సమాజానికి చెప్పే సాధనం. అయితే, భారతదేశంలో లక్షలాది వినికిడి లోపం ఉన్న వ్యక్తులు వారి భావాలను వ్యక్తీకరించగల ఒకే భాష, (ఇండియన్ సైన్ లాంగ్వేజ్) భారతీయ సంజ్ఞ భాష. ఇప్పటికీ రాజ్యాంగం ద్వారా గుర్తించబడని భాషగా మిగిలిపోవడం, అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య భారతదేశానికి సరైనది కాదు.…

పదవులు యాచించను ..

కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన కోమటిరెడ్డి విసుర్లు రాష్ట్ర కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే  ‌కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది. రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటు మొదలు మొదటిసారిగా జరిగిన విస్తర్ణంలో తనపేరు లేకపోవడంపట్ల రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అసహనానికి గురవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడి సుమారు పదిహేను నెలలు కావస్తున్నా ఆయన డిమాండ్‌ ‌డిమాండ్‌గానే ఉంది.…

తెలంగాణా రాజకీయాలలో బిసి ట్రంప్ కార్డు!?

“ఒకవేళ బిసి వాదం రిజర్వేషన్లు సాధించినప్పటికీ బిసి కులాల మధ్య ఉన్న వైరుధ్యాలు ఏబిసిడి మాదిరిగా మరికొన్ని వెనుకబడిన ఉప కుల ఉద్యమాలు ముందుకు రావనే గ్యారెంటీ ఏమీ లేదు..ఒక రకంగా లేని అవకాశాలు కోసం సమాజాన్ని విభజించడానికి,చేసిన వాగ్దానాలు మరిపించడానికి పాలక పక్షాలు జవసత్వాలు ఓనకూర్చే,ఆడే ఎత్తుగఢల క్రీడనే ఈ రకమైన వాదాలు,ఉద్యమాలకు బలాన్ని…

ప్రజల గళంగా మారిన జీవిత సందేశం గద్దర్

“తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి వచ్చినప్పుడు, ఆ ఉద్యమానికి శక్తి నిచ్చిన శబ్దం గద్దర్ గళమే. విభజన అనివార్యమని ప్రకటించి, ప్రాంతీయతను కాదు – ప్రజల ప్రయోజనాలను ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఆయన. ఆయన పాటలు తెలంగాణ ఆకాంక్షకు ప్రాణం పోసినవే. ఉద్యమ కాలంలో జరిగిన అసంఖ్యాక సమావేశాల్లో, సదస్సుల్లో, ఊరేగింపుల్లో గద్దర్ పాటలు బలంగా…

ధ‌ర్నాలు చ‌ట్ట‌బ‌ద్ధ ప‌రిష్కారాలు కావు

Protests are not legal solutions.

“బీసీ రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఈ కీలక సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. ఒక సమావేశంలో ఆయన “సాక్షాత్ ప్రధానమంత్రినే కన్వ‌ర్టెడ్ బీసీ” అని వ్యాఖ్యానించడం కేవలం పదజాలపరమైన తప్పిదం మాత్రమే కాదు.. పదవికి తగిన డెకోరమ్‌ను విస్మరించడం కూడా. ప్రధానమంత్రిపై వ్యక్తిగత…

జయశంకర్ కలల తెలంగాణ ఎక్కడ..?

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్  ద్వారా సీమాంధ్ర కు విచ్చలవిడిగా నీటిని మళ్లిస్తున్నా అధికారానికి దాసోహమైన తెలంగాణ పాలకులు నీళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో  తెలంగాణ  వాదనలు పరిపాలనలో అసమర్థతను కనబరిచినాయి. ఒకవైపు సీమాంధ్రలో నీటి లభ్యత కు మించి చట్ట విరుద్ధంగా విచ్చలవిడిగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నా కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని…

వేడి రాజేస్తున్న వర్షాకాల సమావేశాలు ..!

రాజకీయాల్లో విధాన పరమైన స్పర్ధలు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ సమావేశంలో  అభిప్రాయపడినప్పటికీ బయట మాత్రం అధికార,విపక్షాల మధ్య అందుకు భిన్నమైన వాతావరణమే నెలకొంది.ఈ ఏడాది కాలంలో   బీహార్, అస్సాం, కేరళ, తమిళనాడు,వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల పునరేకీకరణకు తాజా ఎన్డీఏ,…

ఆ పది స్థానాలకు ఉప ఎన్నికలొస్తే ..?

“రాష్ట్రంలో జూబ్లీహిల్స్‌తోపాటు మరో పది శాసనససభ స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యమని విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తమకే అనుకూలమైన తీర్పు ఇస్తారని అధికార కాంగ్రెస్‌తోపాటు, గతంలో ఆ స్థానాలను గెలుచుకున్న భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌)‌లు ప్రచారం చేసుకుంటున్నాయి. కాగా రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఏపీలో మాదిరిగా కూటమి పార్టీలతో కలిసి…