Category ప్రత్యేక వ్యాసాలు

‘ ఉప’ ద్రవం… !

ఎన్ని జాతరలు కలిస్తే ఈ ఎన్నికల జాతరను మరిపిస్తాయి? ఎన్ని రసాలు కలియబెడితే వచ్చిన సారమైనా ఇక్కడ పంచబడే ‘మధు’రసం వలె ఇంతలా ఏరులై పారుతుంది చెప్పండి? తేనెతుట్టెను కదిపినప్పుడు కందిరీగలు పైకి లేచినట్లు నోట్ల కట్టల పాములు కట్లు తెంచుకొని నియోజకవర్గమంతా పాకుతున్నాయి. ఉప’ద్రవాలు రాష్ట్రాన్ని వూరికే వదిలివేయడం లేదు.వాయుగుండం తుపానుగా మారి వర్ష…

యువశక్తే దేశ సంపద…

ఏ ‌దేశానికైనా యువతే భవిత. ఒక దేశ నిర్మాణానికీ, పురోగమనానికీ అవసరమైన కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సామాజికవేత్తలు, భావి నేతలూ యువతరం నుంచే రావాల్సి ఉంటుంది. జీవితంలో ఉత్సాహం, ఉత్తేజం ఉరకలు వేసే ఉజ్వలమైన దశ అది. ఏ దేశానికైనా యువశక్తే గొప్ప సంపద. ఈ కోణంలో చూసినప్పుడు ప్రపంచంలో భారతదేశం…

ముక్తకంఠంతో పర్యావరణ శాస్త్రజ్ఞుల హెచ్చరిక

(ఇటీవల అమెరికన్‌ ‘ఓరిగాన్‌ ‌స్టేట్‌ ‌యూనివర్సిటీ’ శాస్త్రజ్ఞులు విడుదల చేసిన ‘ది సైంటిస్టస్ ‌వార్నింగ్‌’ ‌వీడియోకు స్పందనగా) ప్రస్తుతం భూగోళానికి సంబంధించిన సముద్ర మట్టం, వాతావరణ ఉష్ణోగ్రతలు, కార్బన్‌డైఆక్సైడ్‌ ‌పరిమాణం, సముద్ర మంచు కొండలు /గ్లేసియర్స్, అటవీ వైశాల్యం, జీవవైవిధ్యం లాంటి 35 ముఖ్య ధర్మాల్లో (వైటల్‌ ‌సైన్స్) 16 ‌ధర్మాలు హద్దులు దాటి తీవ్ర…

మునుగోడు ఉప ఎన్నిక కు రంగం సిద్ధం

   స్వేచ్చయుత వాతావరణము లో వోటు హక్కు వినియోగించుకోవాలి నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక ఈ నెల మూడు న జరుగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికార పార్టీ,మరియు భా.జా.పా పార్టీలు ఒక్కొ వోటుకు ఆరు వేల నుండి పది వేల రూపాయల ఇవ్వడం జరుగుతుందని…

మునుగోడులో తుఫాన్‌ ‌ముందుండే నిశ్శబ్దం

మునుగోడులో ఒక్కసారే తుఫాన్‌ ‌ముందుండే నిశ్శబ్దం ఆవరించింది. గత నెలరోజులుగా హోరెత్తిన మైకులు, మోగిన కారు హారన్‌లు, ర్యాలీలు, నినాదాలు, చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ మంగళవారం మౌనం దాల్చడంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు ప్రశాంతంగా మారింది. నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలకు గత నెల రోజులుగా పలు రాజకీయ పార్టీలు కంటి మీద కునుకు లేకుండా…

కానరాని మీడియా స్వేచ్ఛ… కనుమరుగైన జర్నలిస్టుల రక్షణ

‘‘ఆచరణలో స్వేచ్చను హరించే వారిని, అడ్డగోలుగా వ్యవహరించే మీడియా సంస్ధలనూ సరైన దారిలో పెట్టటంలో ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ‌చేష్టలు ఉడిగి ఉంది. ఘటనలపై విచారణలు జరపటం, సిఫార్సులు చేయటం, సుభాషితాలు చెప్పటం తప్ప దానికి ఎలాంటి అధికారాలు లేవు. దేశంలో ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ‌నేడు ఏమీ చేయలేని స్థితిలో ఉంది. అటు తప్పు చేసిన యాజ…

మినరల్‌ ‌వాటర్‌ ‌వ్యాపారంలో వ్యాపారుల ఇష్టారాజ్యం

‘‘ఈరోజు ఎదగాల్సిన చిన్న పిల్లలలో కాల్షియం స్థాయి తగ్గిపోయి ఎముకలు బలహీన పడుతున్నాయి. సాధారణ నీటిలో పిహెచ్‌ ‌స్థాయి సుమారు 65 నుంచి 85 వరకు సాధారణ స్థాయిలో ఉండాలి. సాధారణ మిషన్‌ ‌భగీరథ లాంటి నీటిలో డిడిఎన్‌ 150 ‌మినరల్స్ ఉం‌డే ఆర్వో ప్లాంట్‌ ‌నీటిలో కనీసం 60కి మించి ఉండవు. లవణాలు తొలగించిన…

ప్రలోభాల వలలో చిక్కొద్దు

‘‘ఈనాడు పరిస్థితి చూస్తుంటే ఆరు నెలలకు ఓసారి ఒక ఎమ్మెల్యేను లేదా ఒక ఎంపీని రాజీనామా చేయిస్తూ ప్రజలదృష్టిని మల్లించే నాటకం మొదలు పెడుతున్నాయి. ఈ ప్రభుత్వాలు సమస్యలెన్నో కోకోలలుగా ఉన్న వాటన్నిటిని మరిపించేందుకు అర్థాంతరంగా ఉపఎన్నికలు అంటూ ప్రజల విలువైన కాలాన్ని శ్రమను దోచుకుంటూ, ప్రజా ధనాన్ని వృధచేస్తున్నాయి.’’ ఈనాడు ప్రభుత్వాల పనితీరు చూస్తుంటే…

వోటరుకో మాట

వోటు అంటే… సిరా చుక్క కాదు కాగిత ముక్క కాదు సంతలో సరుకు కాదు రెండక్షరాల పదం కాదు అది దేశ పౌరుల ఆయుధం రాజ్యాంగం కల్పించిన హక్కు వోటు అనే దివ్యశక్తి దేశ చరిత్ర మార్చేస్తుంది ప్రగతి పథం నిర్దేశిస్తుంది వోటు ఆయుధంతో పీఠాలు నిలబెట్టవచ్చు అదేతీరుగా కూల్చవచ్చు రాజకీయ నాయకులను పార్లమెంటుకు పంపవచ్చు…