బంధాల కోసం తపించే నేటి అనుబంధాలు

మనుషుల మధ్య క్రమంగా మాయమౌతున్న అనుబంధాలు మానవజీవనసంక్షోభానికి దారితీస్తున్నాయి. ఆ సంక్షోభం మనుషులు చేజేతులా తెచ్చుకుంటున్నదే. అనుబంధం నిత్యం పల్లవించే పత్రహరితం. ఇప్పుడు ఆ పత్రహరితాన్ని కోల్పోయి జీవనోధ్యానాలు మోడువారిపోతున్నాయి. వాటిని అవేదనల శిశిరాలే ఆవహించేస్తున్నాయి. అనుబంధాలు పైకి కనిపించే కృత్రిమత్వపు ప్లాస్టిక్ పూలైపోతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఒకప్పుడు కళకళలాడిన కుటుంబబంధాలు నేడు పెరిగిపోతున్న…





