Category Shoba

ఓ ‌వర్షం కురిసిన రాత్రి!

తుషారాల తునుకులు తళుకుమంటూ మెరుస్తూ! అంబరం నుండి అమ్బుదిలోకి జారుడు బల్లలు ఆడుతూ! మబ్బుల గోడల మధ్య చిన్నటి కైపులు పోతూ గవాక్షాన్ని తెరచిన వెన్నల రేడు! చిత్రంగా సైగలు రువ్వుతూ! చిక్కటి చీకటి నభములో వెండి తీగలు జిగేలుమంటూ! వెలుగు గీతలు చేసి సన్నటి తుంపరకు తోవచూపుతూ! పచ్చటి సన్నజాజి పందిరి గుబాళింపు తాలింపు…

ఓకటైనకొకటి

మనిషెప్పటికి మారనితనాన్ని ముసుగేసుకుని మొండితనాన్ని మెడలేసుకుని మొరటుతనాన్ని వీడక మోడువారుతున్న వృక్షమై కూలుతున్న బతుకుతో ఊతంకోసమెదురుచూసే బేలచూపులతో బిచ్చగాడౌతున్నడు ఎంత కష్టంజేసిన బతుకుబండక్కడే కూలవడ్డది ఈతిబాధలెన్నైనా ఈదుతునేవున్నా దేహన్నంతా నలుగొట్టుకున్నా దాహంతీరక తీరంచేరక గొంగడక్కడే పాతుకుపోయింది అప్పులకుప్పలు కాళ్ళకు సంకెళ్ళైనయ్‌ ఎం‌తదూరంబోయిన ఎంటాడతనె వుంటయ్‌ ‌గుండెల దిగులైతే తోయనితనాన్నంటించి నిద్రనంతా ఆమడదూరం విసేరేసింది పాడుబతుకుంతా ఆగమాగమయితుంటే…

కాలం ఎప్పుడూ కొత్తదే!

కాలం మనకు కనిపించదు మనం చెప్పినట్లు వినదు మనం చెప్పినట్లు నడుచుకోదు మనం ఆగుమంటే ఆగదు! కాలం మంచి చెడుల తీర్పు మానవ నడవడికల మార్పు రాళ్లమీద నాగరికతల చేర్పు యుగయుగాల చరిత్రల కూర్పు! కాలం చేస్తున్న మాయలు మనం చూస్తున్న అద్భుతాలు ఉదయ అస్తమానాలు కాల పరిణామ గమనాలు! నిరంతర ఆగమన నిష్క్రమనలు అవతరించడం…

తీపి స్పర్శ

చుట్టూ పచ్చని చెట్లు ఎన్ని ఉన్నా ఎండిన ఆ చెట్టుపైనే వాలుతుంది గొంతు…. ఆకుల్లేని కొమ్మల మధ్య ఒంటరితనంతో పూతే లేని ఏకాంతంలో కన్ను, కాలు ఆ వైపుగా ఎగిరి ఆలోచనల గూడులో కలల కాపురమక్కడే. గాలికి కొమ్మలు కొరకోరలాడినా వేడికి చెట్టు చిటచిటలాడినా ఎండిన మేనుపై కూతను పూతగా రాస్తూ కూని రాగంతో సేవ…

ఆకారం కోసం ఆరాటం

కష్టాల బండరాళ్లు నా గమ్యాన్ని నిరోధిస్తోంటే, పోటెత్తిన భావాలన్నీ పొర్లుకుంటూ వచ్చి మదిగోడలపై పరచుకోగా, కునుకు రావడంలేదు కంటిమీదకు. కన్నీటి నదుల్ని, వెతల సుడుల్ని గర్భాన్ని దహించే క్షుధానలాన్ని దాచుకొనే శక్తి ఉన్న నా మదిలో ఏదైనా చేయాలి, ఏదో చేయాలనే తపన మస్తిష్కాన్ని దొలిచేస్తోంది. నిరంతర స్పర్శతో పాషండులను సైతం మృదువుగా మార్చే స్నేహగుణం…

ఆనవాళ్లు పోతాయి

బతుకు ఆటలో మెతుకు వేటలో అనుక్షణమూ ఆరాటంతో బ్రతుకంతా పోరాటంతో భారమైన బానిస బతుకులు కొందరివైతే, మమతలన్నీ మాసిపోయి నీతిపూలన్నీ వాడిపోయి మానవతలన్నీ మండిపోయి పైకి మనిషితత్వం లోలోన రాక్షసత్వంతో రంగస్థలాన్ని మరపించే నటనతో కూడిన జీవనం సాంగిచే బతుకులు ఇంకొందరివి. అవసరంకోసం మనుషులను అవకాశాలకోసం సందర్భాలను అడుగడుగునా సృష్టించుకొనే ఈ సృష్టిలో, నాటికి నేటికి…

సృష్టికారుని చిత్రం

పచ్చని నీటి రంగులతో భూకాన్వాస్‌ ‌పై తన నాగలి కుంచెతో అద్భుత ఊపిరి కళాఖండాల్ని సృష్టిస్తాడు ఈ కర్షక కళాకారుడు మొదట గీస్తాడు తలంపై పొలాన్ని చక్కగా చారలు చేసి చల్లుతాడు మొలకెత్తే రంగులను.. ఆపై ఒక తడి అలను అలా జిలకరిస్తాడు అంతే! ఒక నిఖార్సైన కళాజీవి మస్తిష్కంలోకి ఈ ప్రపంచం తీసుకోబడి చిలికి…

సంపాదకుల్లో శిఖరాగ్రాన రాఘవాచారి

నేడు  83వ జయంతి వృత్తిలో, ప్రవృత్తిలోనూ సిద్ధాంతకర్తగా నిలిచి దాదాపు అర్ధ శతాబ్దం పాటు విశాలాంధ్ర సంపాదకులుగా చైతన్యం రగిలించి ఎందరిలోనూ స్ఫూర్తి నింపిన చక్రవర్తుల రాఘవాచారి 83వ జయంతిన నేడు పత్రికాలోకం, పాఠకలోకం స్మరించుకుని నివాళులర్పిస్తున్నది. 1939 సెప్టెంబరు 10వ తేదీన వరంగల్ జిల్లా శాతాపురంలో సంప్రదాయ కుటుంబంలో పుట్టినా కట్టుబాట్లను తెంచుకుని, కమ్యూనిస్టు…

అక్షరం

జ్ఞానదీపిక అక్షరం, మార్గదర్శి అక్షరం. అదొక జీవన వేదం, తరతరాల ఆస్తి. మంచిచెడులు బోధించే విద్యాబుద్ధులు, నడక,నడత,నాగరికత నేర్పే అక్షరమే… విజ్ఞానం,విశ్వపరిజ్ఞానం. అదొక అనుబంధం, అనుసంధానం, ప్రగతికి సోపానం. అజ్ఞాన తిమిరనాశినియై వెలుగునిచ్చే అక్షరం ఆయుధాల కన్నా, అణుబాంబుల కన్నా శక్తివంతం. అక్షర సేద్యం అభివృద్ధి ఫలం, అజారామరం, వలచిన వారికి వరం. అదొక అక్షయ…