Category Shoba

సమూహం

భూమి ఆకాశం తూర్పు పడమర ధన ఋణ సంబంధం ఋణ ధన సంబంధం ధన ఋణ సంబంధాలు వెలుగు చీకట్ల బతుకు రేఖలు రెండింటి మధ్యే సర్వం అందుకే నడుస్తుంది విశ్వమానవ  జీవనం – రేడియమ్‌ 9291527757

కాలం కఠినమై..

కంఠాన్ని కఠినమైన ప్రశ్నలు నలిమేస్తున్నాయి. కాలం బుసకొట్టే నాగుపాములై దూసుకొస్తుంది. మోసం చాటున నక్కిన నయవంఛకుల చేతిలోపడి కష్టం కన్నీటివానై కురుస్తుంది. స్వేదపుచుక్కల సాక్షిగా మనిషిశిఖరం కూలిపోతుంది. నేలను చదునుచెయ్యడం నేర్చినవాడిని. మొక్కలకు పానం పోసి పెంచడం ఎరిగినవాడిని. భూమిని నమ్ముకొని బువ్వపూలు పూయించేవాడిని. తెల్లని బంగారాన్ని పందించేవాడిని పసుపుపచ్చని పసిడికొమ్ములతో తొలిబోనమై పొశవ్వకు పసుపుకుంకుమలు…

పసిడి పంటల పాలమూరు

నేటి పాలమూరు పసిడి పంటల పచ్చని పైరులతో దర్శనము ఇస్తూ ఆనాటి కరవు జిల్లా ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ఎ‌ర్రలు వారినా నేల, పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్న చుక్క నీరు అందల్ఱే రైతన్న వరుణ దేవుడిని నమ్ముకొని గింజలు ఎసిన వానకు ఆకాశానికై ఎదురు చూపు….. పశు గ్రాసాన్ని పక్క రాష్ట్రాల నుంచి తెచ్చిన…

మృగాంతం

ఎలుక లున్నాయి పిల్లులున్నాయి కుక్కలున్నాయి దాడి శత్రుత్వం మనుష్యులున్నారు బానిసత్వం అణిచి వేత జీవులంతా తిండికై వేట… ఆకలి తీరని దాహం దాడులు ప్రకృతి సహజం మనిషి లోని మృగం మనిషి పైనే దాడి రాకాసి మృగం అంతమే మరోమనిషికి జీవం ఆది అంతా ల మధ్య సమరమే పరిష్కారం లేదా సంధియే సత్కృతి –…

(అ)స్పృహ

ఇంకెంతని ఏమని భరించగలదు ఈ దేహం బాల్యం నుండి గాయాలే కదా గతం నుండి యుద్ధాలే కదా ఇంకెంత కర్కషత్వం చవిచూసేది అవమానం అస్తిత్వాన్ని హత్య గావిస్తూ చిల్లులు పెడుతుంది ఆత్మాభిమానం ఆద్యంతం వద్దని వారిస్తది చూసే కళ్ళు కలిపే చేతులు నవ్వే మొహాలు ఎక్కడో తావు వెతుక్కున్నవే ఒకరిపై భారం పడొద్దు అనుకుంటూనే వాళ్ళ…

విముక్తి

ఏమోయ్‌ కాసింత కాఫీ ఇస్తావా? ఇస్తాలే గాని అంత బిజీగా ఏం ప్రిపేర్‌ అవుతున్నారు రేపటి ఉపన్యాసం గురించి అవునా… దేని గురించండి? విముక్తి గురించి ఏమోయ్‌ మధ్యాహ్నంకి కాసింత భోజనం ఎక్కువ చెయ్యవా ఏంటండీ అంత ఆకలిగా ఉందా? లేదులే! మా మిత్రుడొకరు ఓ చర్చ చెయ్యడానికి వస్తున్నారు అవునా… దేనిమీదండి? విముక్తి మీద…

నిర్భయంగా.. నిరాటంకంగా…

కవిత్వంతోనే/  నా ఊపిరి వెలిగించుకుంటాను/   కవిత్వంలోనే /   నా ఆయువు పొడగించుకుంటాను/  నా కవిత్వానికి/  నేనే వాక్యాంతాన్నవుతానన్నారు కంచరాన భుజంగరావు. నీటి గింజల పంట పేరిట వెలువడిన ఆయన సంపుటిలోని కవితలు వచన కవిత్వంలో సరికొత్త అభివ్యక్తికి ఉదాహరణలుగా కనిపించాయి. నాగలి వెంట నడిచే కవిని నేను /  కవిత్వమే నా కుడి…

ఆకాశం కథ!

ఒకప్పుడు ఆకాశం అంతా అంధకారంగా ఉండేది. ఆకాశం  భయపడలేదు? నిస్సత్తువని చేరతీయలేదు? సహనాన్ని, సమయాన్ని నమ్ముకుంది! వేకువ వచ్చే వరకు వేచి చూసింది. చివరగా విజయాన్ని చవిచూసింది! ఆవహించే అంధకారానికి సమాయత్తం అయ్యింది! నక్షిత్రాలని పొదుగుకుంది. మెరుపురవ్వల్ని దాచుకుంది! ఉల్కాపాతాన్ని రగుల్చుకుంది! దివాకరుడిని లాలిస్తూనే, రజనీకరుడిని కవ్వించింది! ఇప్పుడు చీకటంటే ఆకాశానికి ఓ కోలాహలం! ఓ…

జీవన ధైన్యం…

ఆకలితో జగడం మనిషికి ఈ నాటిది కాదు. సందర్భమేదైనా, అందుకు కారణాలు ఎలాంటివైనా జానెడు పొట్ట కోసం అనునిత్యం ఆకలి యుద్ధం మనిషికి తప్పడం లేదు. మానవాళి బ్రతుకును వెక్కిరించి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన కలికాలపు మహమ్మారి కరోనా. ప్రపంచ జీవన కదలికే దాని ధాటికి ఆగిపోయినా ఆకలి మాత్రం పాదాన్ని వేలమైళ్లు ప్రయాణింపజేసింది. పొట్టపోసుకునేందుకు…